Home Actor బ‌న్నీ మ‌రో రెండు ప్రాజెక్టులు ఓకే చేసాడా..?

బ‌న్నీ మ‌రో రెండు ప్రాజెక్టులు ఓకే చేసాడా..?

89
0

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా త‌ర్వాత గ్యాప్ తీసుకున్న‌ప్ప‌టికీ..ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే..బ‌న్నీ, సుకుమార్ తో సినిమాని ఎనౌన్స్ చేసారు. ఆర్య‌, ఆర్య 2 త‌ర్వాత బ‌న్నీ, సుక్కు క‌లిసి చేస్తున్న క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. త్రివిక్ర‌మ్ సినిమాతో పాటే సుకుమార్ సినిమాని కూడా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే…బ‌న్నీ ఈ రెండు సినిమాలతో పాటు మ‌రో రెండు సినిమాల‌కు ఓకే చెప్పాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ రెండు సినిమాలు ఏంటంటే…మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ తో ఓ సినిమా. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ మురుగుదాస్ తో మ‌రో సినిమా. ఇవే కాకుండా బాలీవుడ్ మూవీ ప్లాన్ కూడా ఉంద‌ని స‌మాచారం. మొత్తానికి బ‌న్నీ ప్రాజెక్ట్స్ ని బాగానే సెట్ చేసుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here