Home Actor బ‌న్నీ సినిమాలో అక్కినేని హీరో..!

బ‌న్నీ సినిమాలో అక్కినేని హీరో..!

119
0

బ‌న్నీ సినిమాలో అక్కినేని హీరో న‌టించ‌డం ఏంటి..? అనుకుంటున్నారా..?  ఇది నిజంగా నిజం. అయితే.. ఆ హీరో ఎవ‌రంటారా.?  సుశాంత్. అవును కాళిదాసు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ క‌రెంట్, అడ్డా చిత్రాల‌తో ఆక‌ట్టుకుని చి ల సౌ సినిమాతో విజ‌యం సాధించాడు. ఈ సినిమా వ‌చ్చి దాదాపు సంవ‌త్స‌రం అవుతుంది. నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేయ‌నున్నాడా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటే…బ‌న్నీ సినిమాలో న‌టిస్తున్నాను అని చెప్పి షాక్ ఇచ్చాడు.

ఈరోజు ట్విట్ట‌ర్ లో సుశాంత్ స్పందిస్తూ…అల్లు అర్జున్ 19వ చిత్రంలో న‌టిస్తున్నాను. ఈ రోజు షూటింగ్ లో పాల్గొన్నాను. నా అభిమాన ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన త్రివిక్ర‌మ్ గారు, బ‌న్నీ,  ట‌బు గారు, పూజా ల‌తో వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌ల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. చి ల సౌ త‌ర్వాత నేను చేస్తోన్న మ‌రో సాహ‌సం ఇది. ఈ అమేజింగ్ టీమ్ ద‌గ్గ‌ర  ఎన్నోవిష‌యాలు నేర్చుకుంటాను అనే న‌మ్మ‌కం ఉంది. అయితే…ఇందులో త‌న పాత్ర ఏంటి అనేది మాత్రం ఇప్పుడు చెప్ప‌న‌న్నారు.

చి ల సౌ విజ‌యం త‌ర్వాత హీరోగా మ‌రో సినిమా చేయ‌కుండా బ‌న్నీ సినిమాలో న‌టించ‌డం అంటే…నిజంగా సాహ‌స‌మే. మ‌రి… ఈ సాహ‌సంతో సుశాంత్ ఎంత వ‌ర‌కు స‌క్స‌స్ సాధిస్తాడో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here