Home Actor బ‌న్నీ – సుక్కు మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్..?

బ‌న్నీ – సుక్కు మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్..?

35
0
బ‌న్నీ - సుక్కు మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్..? spiceandhra

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో ఓ మూవీ రానుంద‌ని ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బ‌న్నీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ మూవీ త‌ర్వాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేయ‌నున్నాడు అని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో సుకుమార్ తో ఎనౌన్స్ చేసిన మూవీ ఎప్పుడు ఉంటుంది అనేది ఆస‌క్తిగా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… సుకుమార్ ఇటీవ‌ల బ‌న్నీకి ఫ‌స్టాఫ్ చెప్పాడ‌ట‌. బ‌న్నీకి బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే సెకండాఫ్ రెడీ చేయ్ మ‌ని చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం సుకుమార్ త‌న టీమ్ తో  గోవాలో సెకండాఫ్ స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నార‌ని స‌మాచారం.

సెకండాఫ్ కూడా రెడీ చేస్తే.. షూటింగ్ స్టార్ట్ చేయ‌చ్చ‌ని బ‌న్నీ సుక్కుతో చెప్పార‌ట‌.ఈ భారీ చిత్రాన్నిమైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. దీంతో  త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత బ‌న్నీ.. సుకుమార్ తో సినిమా చేస్తాడా..?  వేణు శ్రీరామ్ ఐకాన్ స్టార్ట్ చేస్తాడా అనేది స‌స్పెన్స్ గా ఉంది. మ‌రి.. ఏ సినిమా స్టార్ట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here