Home Actor బ‌న్నీ, సుక్కు సినిమా ప్రారంభం ఎప్పుడు..?

బ‌న్నీ, సుక్కు సినిమా ప్రారంభం ఎప్పుడు..?

38
0
బ‌న్నీ, సుక్కు సినిమా ప్రారంభం ఎప్పుడు..? spiceandhra

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో ఆర్య‌, ఆర్య 2 చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రూపొందే భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ, వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా స్టార్ట్ చేయ‌నున్నాడు అని ప్ర‌చారం జ‌ర‌గుతుంటో మ‌రో వైపు ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో కూడా బ‌న్నీ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని.. ఈ సినిమాని న‌వంబ‌ర్ నుంచి స్టార్ట్ చేయ‌నున్నాడ‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో అస‌లు..సుకుమార్ తో బన్నీ మూవీ ఉందా..?   లేదా..?  అనే డౌట్ స్టార్ట్ అయ్యింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… సుకుమార్ తో సినిమాని ద‌స‌రాకి ప్రారంభించి… న‌వంబ‌ర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. బ‌న్నీ స‌ర‌స‌న రష్మికా మండన్నా న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here