Home Telugu భారీ స్ధాయిలో గూఢ‌చారి ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్..!

భారీ స్ధాయిలో గూఢ‌చారి ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్..!

99
0

అడివి శేష్ న‌టించిన  స్పై థ్రిల్లర్ గూఢ‌చారి. శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గూఢ‌చారి చిత్రానికి అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను పాజిటివ్ టాక్ ఉంది. ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ & ట్రైల‌ర్..ఇలా ప్ర‌తిది డిఫ‌రెంట్ గా ప్లాన్ చేయ‌డంతో గూఢ‌చారి యూత్ ని బాగా ఆక‌ట్టుకున్నాడు. ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్ర నిర్మాత‌లు ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించ‌డంతో ప్ర‌తి ఫ్రేమ్ చాలా రిచ్ గా క‌నిపిస్తుంది.

టీజ‌ర్ & ట్రైల‌ర్ లో విజువ‌ల్స్ చూస్తుంటే..ఓ హాలీవుడ్ మూవీ చూస్తోన్న ఫీలింగ్ క‌లుగుతోంది. ఖ‌చ్చితంగా  ఓ కొత్త త‌ర‌హా సినిమా చూసామ‌నే ఫీలింగ్ తో థియేట‌ర్ నుంచి ఆడియ‌న్స్ బ‌య‌ట‌కు వ‌స్తార‌ని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ మూవీలోని ఏదో ఏదో మ‌న మ‌ధ్య‌లో…అనే రొమాంటిక్ సాంగ్ ను ఈరోజు ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. శ్రీ చరణ్ పాకాల సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సాంగ్ కి యూత్ బాగా క‌నెక్ట్ అవుతున్నారు.

ఆగ‌ష్టు 3న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈరోజు (ఆగ‌ష్టు 1న‌) రాత్రి 7 గంట‌ల‌కు హైద‌రాబాద్ లో భారీ స్ధాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సుప్రియా యార్లగడ్డ వెండితెరకు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. మ‌రి..క్ష‌ణం సినిమా వ‌లే గూఢ‌చారి కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని ఆశిద్దాం.


 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here