Home Actor భారీ స్ధాయిలో మ‌జిలీ రేపే విడుద‌ల‌..!

భారీ స్ధాయిలో మ‌జిలీ రేపే విడుద‌ల‌..!

89
0


అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌జిలీ చిత్రం పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. ట్రైల‌ర్ & సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం..చైత‌న్య‌, స‌మంత పెళ్లి త‌ర్వాత న‌టించిన ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రం రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం భారీ స్ధాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక్క నైజాంలోనే 200 ధియేట‌ర్ల‌లో ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఉగాది సంద‌ర్భంగా శ‌నివారం సెల‌వు కావ‌డం..అలాగే పెద్ద సినిమాలేవి లేక‌పోవ‌డం వ‌ల‌న మ‌జిలీ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంటుంది అని చిత్ర‌యూనిట్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. గోపీ సుంద‌ర్, త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here