Home Actor భారీ స్ధాయిలో రామాయ‌ణ – తొలి భాగం 2021లో విడుద‌ల‌.

భారీ స్ధాయిలో రామాయ‌ణ – తొలి భాగం 2021లో విడుద‌ల‌.

68
0
భారీ స్ధాయిలో రామాయ‌ణ - 2021లో తొలి భాగం విడుద‌ల‌ spiceandhra

 ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్  రామాయ‌ణాన్ని భారీ స్ధాయిలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత మ‌ళ్లీ ఈ సినిమా గురించి గీతా ఆర్ట్స్ సంస్థ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందేమో అనుకున్నారు. అయితే..ఈ రోజు ఈ మూవీ గురించి అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. అల్లు అరవింద్ ఈ భారీ చిత్రాన్ని మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా తో క‌లిసి నిర్మించ‌నున్నారు.

దంగల్ చిత్ర ఫేమ్ నితీష్ తివారి మరియు మామ్ మూవీ ఫేమ్  ర‌వి ఉద్యావర్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు.  ఈ భారీ చిత్రాన్ని మూడు భాగాలుగా 3Dలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందించనున్నట్లు నిర్మాతలు ప్రకటించడం జరిగింది. ఇక ఈ మూడు భాగాల్లోని మొదటి భాగాన్ని 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే… ఈ చిత్రంలో న‌టించే నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఎవ‌ర‌నేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here