Home Actor భార‌తీయుడు 2 ఆగిందా..? శ‌ంక‌ర్ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడా..?

భార‌తీయుడు 2 ఆగిందా..? శ‌ంక‌ర్ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడా..?

162
0

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం భార‌తీయుడు 2. ర‌జ‌నీకాంత్ తో తెర‌కెక్కించిన 2.0 సినిమా రిలీజ్ అయిన వెంట‌నే భారతీయుడు 2 షూటింగ్ లో స్పీడు పెంచాడు. ఈ మూవీ సెట్స్ పైకి వ‌చ్చింది కానీ..ఎందుక‌నో ముందుకు వెళ్ల‌డం లేదు. దీంతో భార‌తీయుడు 2 ఆగిపోయింది అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల్లో వాస్త‌వం లేదు. షూటింగ్ జ‌రుగుతుంద‌ని గతంలో క‌మ‌ల్ హాస‌న్ క్లారిటీ ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ ఆగింది అంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా కోలీవుడ్ లో ఈ వార్త‌ల‌కు బలాన్ని చేకూరుస్తూ ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాను లైన్లో పెట్టడానికి శంకర్ ప్రయత్నాలు ప్రారంభించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కోసం విక్ర‌మ్, విజ‌య్ ల‌ను శంక‌ర్ సంప్ర‌దించార‌ని టాక్ వినిపిస్తోంది. అస‌లు ఈ ప్రాజెక్ట్ ని భార‌తీయుడు 2 త‌ర్వాత చేద్దాం అనుకున్నార‌ని…కానీ భార‌తీయుడు 2 ఆగిపోవ‌డం వ‌ల‌నే ఈ క‌థ‌ను బ‌య‌ట‌కు తీసార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి…ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై శంక‌ర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here