Home Actor భార‌తీయుడు 2 విడుద‌ల తేదీ ఖ‌రారు.

భార‌తీయుడు 2 విడుద‌ల తేదీ ఖ‌రారు.

20
0
భార‌తీయుడు 2 విడుద‌ల తేదీ ఖ‌రారు. spiceandhra

యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ – గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేషన్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భారతీయుడు.  ఈ సినిమాకి సీక్వెల్ గా భార‌తీయుడు 2 చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఇటీవ‌ల ప్రారంభం కావ‌డం.. ఆత‌ర్వాత ఆగిపోయింది అంటూ వార్త‌లు రావ‌డం జ‌రిగింది. కానీ… తాజా స‌మాచారం ప్ర‌కారం ఇటీవలే ఈ ఇద్దరూ మ‌ళ్లీ రంగంలోకి దిగారు.

200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు వచ్చారు. అడ్డంకులన్నింటినీ తొలగించుకున్న ఈ చిత్ర దర్శక నిర్మాతలు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు మొదలెట్టినట్టు తెలిసింది. త్వ‌ర‌లో రాజ‌మండ్రిలో షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. భార‌తీయుడు సీక్వెల్ అంటే భారీ అంచ‌నాలు ఉంటాయి.

ఆ..అంచ‌నాల‌కు దీటుగా ఉండేలా ఈ సినిమాని శంక‌ర్ రూపొందిస్తున్నార‌ట‌. ఇక రిలీజ్ విష‌యానికి వ‌స్తే…  2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here