Home Actor భీమవరం,గాజువాక స్థానాల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ.

భీమవరం,గాజువాక స్థానాల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ.

50
0


జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం,విశాఖజిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయవలసిందిగా పార్టీ జనరల్ బాడీ ఆయనను కోరింది. శ్రీ పవన్ కళ్యాణ్  ఎక్కడ నుంచి పోటీ చేస్తే పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందో తెలుసుకోవడానికి జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపించింది.అనంతపురం,తిరుపతి,రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక,పెందుర్తి,ఇచ్చాపురం స్థానాలు అగ్రస్థానంలో నిలిచాయి.

ఈ ఎనిమిది స్థానాల పై అంతర్గత సర్వే జరిపించిన జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు  భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేయవలసిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ ను కోరారు. దీనికి  ఆమోదం తెలిపిన శ్రీ పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. నామినేషన్ ఏ రోజున దాఖలు చేయనున్నది ఈ రోజు సాయంత్రం లేదా రేపు తెలియ చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here