Home Actor మహిళా దినోత్సవం సందర్బంగా క‌థ‌నం టీజర్ ని విడుదల చేసిన మెగా పవర్ స్టార్ రామ్...

మహిళా దినోత్సవం సందర్బంగా క‌థ‌నం టీజర్ ని విడుదల చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన..!!

85
0

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’. ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్ పై బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శ‌ర్మ‌చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్‌ సంగీతం సమకూరుస్తుండగా, స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకోగా, నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ టీజర్ ని మెగా పవర్ స్టార్ సతీమణి కొణిదెల ఉపాసన విడుదల చేయడం విశేషం.

ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ…క‌థ న‌చ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అన‌సూయ‌గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఆమె కెరీర్ లో ఇదొక బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేశాం .టీజర్ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న కొణిదెల ఉపాసన గారికి కృతజ్ఞతలు.. అన్నారు.

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ… ఇది నా మొద‌టి చిత్రం.. క్ష‌ణం, రంగ‌స్థ‌లం తర్వాత ఆమె చేస్తున్న ఈ క‌థ‌నం సినిమాతో హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారు అన‌సూయ గారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. న‌రేంద్ర‌రెడ్డి గారు పంపిణిదారునిగా ఏ సినిమా చేసినా హిట్.. ఆయ‌న‌ది ల‌క్కీ హ్యాండ్. ఏ సినిమా చేసినా హిట్ అయ్యాయి. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉంది. ఇక ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేసిన ఉపాసన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన అందరికీ చాల థాంక్స్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here