Home Actor మహిళా దినోత్స‌వం రోజు అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఏం చేయ‌నుందో తెలుసా..?

మహిళా దినోత్స‌వం రోజు అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఏం చేయ‌నుందో తెలుసా..?

94
0


ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మెయిన్ లీడ్ గా న‌టిస్తున్నారు.  మహిళా దినోత్స‌వం సందర్భంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ… క‌థ న‌చ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అన‌సూయ గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఆవిడ కెరీర్ లో ఇదొక  బ్లాక్ బ‌స్ట‌ర్  అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. మహిళా దినోత్స‌వం సందర్భంగా మార్చి8 న టీజర్ ను విడుదల చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ… ఇది నా మొద‌టి చిత్రం. క్ష‌ణం, రంగ‌స్థ‌లం అనంతరం క‌థ‌నంతో హ్యాట్రిక్ కొట్ట‌బోతుంది అన‌సూయ గారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. న‌రేంద్ర‌రెడ్డి గారు పంపిణిదారునిగా  ఏ సినిమా చేసిన హిట్. ఆయ‌న‌ది ల‌క్కీ హ్యాండ్. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారు.

ఇంకా ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్ః సునీల్ క‌శ్య‌ప్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వంఃరాజేష్ నాదెండ్ల‌,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here