Home Actor మహేష్ – అనిల్ రావిపూడి సినిమా క‌థేంటి..?

మహేష్ – అనిల్ రావిపూడి సినిమా క‌థేంటి..?

93
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ సెన్సేష‌న్ మ‌హ‌ర్షి. ఈ సినిమా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ..స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ ఈ సినిమా స‌క్స‌స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్ త‌న 26వ చిత్రాన్ని సక్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని వ‌చ్చే నెల‌లో ప్రారంభించ‌నున్నారు.

అయితే.. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అనిల్ రావిపూడి మ‌హేష్ ని ఎలా చూపించ‌బోతున్నాడు..?  ఇంత‌కీ క‌థ ఏంటి..? అనేది ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం… ఈ సినిమాలో మ‌హేష్ ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని ఓ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలిసింది. అదేమిటంటే.. హిమోఫోబిక్‌గా ఈ పాత్ర ఉంటుంద‌ట‌. అంటే.. ర‌క్తాన్ని చూసి భ‌య‌ప‌డే డిజార్డ‌ర్ అన్న‌మాట‌.

ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు చాలా స‌ర‌దాగా ఉంటాయ‌ని స‌మాచారం. అంతే కాకుండా.. ఈ సినిమాలో మ‌హేష్ బాబు రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడట. రాయ‌ల‌సీమ యాస‌లోనే డైలాగ్స్ ఉంటాయ‌ట‌. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here