Home Movie News మాట‌ల మాంత్రికుడు.. మ‌న‌సులో మాట‌లు..!

మాట‌ల మాంత్రికుడు.. మ‌న‌సులో మాట‌లు..!

106
0
1428827700-1504

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్..తెర‌కెక్కించిన తాజా చిత్రం అర‌వింద సమేత.. వీర రాఘ‌వ‌. మీడియాకి దూరంగా ఉండే ఈ మాట‌ల మాంత్రికుడు..గ‌త రెండు మూడు రోజులుగా మీడియాకి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. దీనికి కార‌ణం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. అవును..ఈ విష‌యాన్ని స్వ‌యంగా త్రివిక్ర‌మే తెలియ‌చేసారు. మీడియాకి చాలా దూరంలో ఉంటారు క‌దా..కార‌ణం ఏంటి..?  ఈ సినిమా విష‌యంలో ఇంత ద‌గ్గ‌ర‌గా ఉండ‌డానికి కార‌ణం ఏంటి..?  అని అడిగితే…కెమేరాలు చూస్తే పారిపోతాను. కానీ ఈసారి ఎన్టీఆర్ బలవంతం చేసి ఇంటర్వూల్లో కూర్చోపెట్టారు అని చెప్పారు.

ఎన్టీఆర్ కోసం అనుకున్న క‌థ ఇదేనా..?  లేక వేరే హీరోతో అనుకుంటే ఎన్టీఆర్ కి సెట్ అయ్యిందా..?  అని అడిగితే…ఎన్టీఆర్ కు నాలుగైదు సబ్జెక్ట్ లు చెబితే, ఇద్దరం కనెక్ట్ అయింది అరవింద స‌మేత క‌థే అని చెప్పారు. వెంకీతో సినిమా అని వార్త‌లు వ‌స్తున్నాయి ఎప్పుడు అని అడిగితే..సరైన కథ సెట్ కావడంలేదు. ఇద్దరికీ నచ్చే కథ కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు. మ‌రి..బ‌న్నీతో సినిమా చేయ‌నున్నారు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి నిజ‌మేనా..?  అంటే బ‌న్నీతో సినిమా ఇంకా క‌న్ ఫ‌ర్మ్ కాలేద‌న్నారు.  మహేష్ తో సినిమా ఎప్పుడు అంటే..ఇద్ద‌రికీ చేయాల‌ని ఉంది కానీ..ఎప్పుడు సెట్ అవుతుందో తెలియ‌దు అంటూ మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు త్రివిక్ర‌మ్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here