Home Movie News మామూలు పాట కాదు ఇది.!

మామూలు పాట కాదు ఇది.!

120
0
DndA0_bU4AAD0h1

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇటీవ‌ల ఈ చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ రోజు (సెప్టెంబ‌ర్ 19)న 4.50 నిమిషాల‌కు హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా పెనిమిటి అనే సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా…ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

పెనిమిటి అనే పాట గుండెల‌ను పిండేస్తుంది అని రామ‌జోగ‌య్య శాస్త్రి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే..పాట వింటుంటే అదే ఫీలింగ్ క‌లుగుతుంది. ప‌ది కాలాలు పాటే నిలిచే పాట ఇది. ఈ పాట‌కు విశేష స్పంద‌న వ‌స్తుండ‌డంతో రామ‌జోగ‌య్య శాస్త్రి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ… మళ్ళీ చెప్తున్నా ..మామూలు పాట కాదు ఇది…..నా అదృష్టం ..ఇలాంటి సందర్భాన్ని నాకిచ్చారు త్రివిక్రంగారు అంటూ త‌న సంతోషాన్ని పంచుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here