Home Actor మార్పు మ‌న‌లో రావాలి అంటున్న ఓట‌ర్

మార్పు మ‌న‌లో రావాలి అంటున్న ఓట‌ర్

73
0


మంచు విష్ణు హీరోగా న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా ఓట‌ర్‌. ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై జి.ఎస్‌.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.ఎస్.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా రాజేష్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సంప‌త్‌రాజ్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముళి, ప్ర‌గ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ రోజు ఓట‌ర్ టీజ‌ర్ రిలీజ్ చేసారు. మార్పు మ‌న‌లో రావాలి.., ఆఫ్ట్రాల్ ఓట‌ర్ కాదు..ఓన‌ర్ ని.., అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెటు కూడా పేల్చ‌కుండా స్వాతంత్ర్యం తెచ్చుకున్న దేశం మ‌న‌ది…ఈ డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వాతావ‌ర‌ణానికి త‌గ్గ‌ట్టుగా వ‌స్తోన్న ఈ పొలిటిక‌ల్ డ్రామా అంద‌రికీ క‌నెక్ట్ అవుతాది అనిపిస్తుంది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. మ‌రి…స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తోన్న విష్ణుకి ఓట‌ర్ అయినా విజ‌యాన్ని అందిస్తాడో లేదో చూడాలి..!  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here