Home Actor మార్పు రావాలంటే సామాన్యులు రాజ‌కీయాల్లోకి రావాలి – ప‌వ‌న్ క‌ళ్యాణ్

మార్పు రావాలంటే సామాన్యులు రాజ‌కీయాల్లోకి రావాలి – ప‌వ‌న్ క‌ళ్యాణ్

131
0


* నాయకుల్ని ప‌ల్లకీలు దించి నిజాయితీప‌రుల్ని ఎక్కిద్దాం

* నెల్లూరు జిల్లా అభివృద్ది కొన్ని కుటుంబాల‌కే ప‌రిమితం అయ్యింది

* కావ‌లి నాయ‌కులు ఒక‌రు వ్యాపారాల్లో, ఇంకొక‌రు క‌బ్జాల్లో బిజీగా ఉన్నారు

* ప్రజ‌ల క‌ష్టాలు ప‌ట్టించుకునేందుకే జ‌న‌సేన వ‌చ్చింది

* ప్రభుత్వ సంప‌ద అన్ని వ‌ర్గాల‌కీ స‌మంగా పంచుతాం

* కావ‌లి బ‌హిరంగ స‌భ‌లో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్

నెల్లూరు జిల్లాలో అభివృద్ధి కొన్ని కుటుంబాల‌కే ప‌రిమితం అవుతోంది. ప్ర‌జ‌లు న‌లిగిపోతున్నారు. నెల్లూరు రాజ‌కీయ వ్య‌వ‌స్థ మారాలని జ‌న‌సేన పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. అన్ని కులాల్లో ఉన్న పేద‌ల‌కి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావ‌లిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. స‌భ‌కి హాజ‌రైన జ‌న వాహినిని ఉద్దేశించి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ఇంత వరకు  కుటుంబ రాజకీయ నాయకుల పల్లకీలు మోసింది చాలు. ఇక పై బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన, నీతినిజాయతీ గల వ్య‌క్తుల్ని ప‌ల్ల‌కీలు ఎక్కించి మోద్దాం. అన్ని కులాలకు సంబంధించిన, ఉన్నత విలువలు ఉన్న వ్యక్తుల్ని చట్ట సభలకు పంపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. సుధాక‌ర్ గారి లాంటి వ్య‌క్తుల్ని చ‌ట్ట‌స‌భ‌ల‌కి పంపుదాం.

రూ. 45 రూపాయిల రోజు కూలితో జీవితం ప్రారంభించిన వ్య‌క్తి సుధాక‌ర్ గారు. స్కూలు పిల్ల‌లకి సౌక‌ర్యాలు క‌ల్పిచేందుకు త‌న సంపాద‌న నుంచి ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టేందుకు వెనుకాడ‌ని వ్య‌క్తి. ప‌ట్టుద‌ల‌తో పైకి వ‌చ్చిన వ్య‌క్తి. ఆయ‌న నన్ను క‌లిసిన‌ప్పుడు బ‌యోడేటా ఇవ్వండి స్క్రీనింగ్ క‌మిటీ మీ అభ్య‌ర్ధిత్వం ప‌రిశీలిస్తుంద‌ని చెప్పాను. జ‌న‌ర‌ల్ బాడీ ఆయ‌న అభ్య‌ర్ధిత్వాన్ని ప‌రిశీలిస్తుంది.  కావాలంటే  ఉన్న రాజ‌కీయ కుటుంబాల్లో ఏదో ఒక కుటుంబం నుంచి అభ్య‌ర్ధిని ఎంచుకోవ‌చ్చు. కానీ మార్పు రావాలంటే ప్ర‌జ‌ల క‌ష్టం తెలిసిన సామాన్యులు రాజ‌కీయాల్లోకి రావాలి. సుధాక‌ర్ వ‌డ్డెర‌ కులానికి చెందిన వ్య‌క్తి. వ‌డ్డెర్ల క‌ష్టం నాకు తెలుసు. రాళ్లు కొట్టి కొట్టి అంద‌రికీ ఇల్లు నిర్మిస్తారు. కానీ వాళ్ల‌కు మాత్రం ఉండ‌దు. బీసీల‌కు అండ‌గా జ‌న‌సేన ఉంటుంది.

జిల్లా మంత్రి సోమిరెడ్డి గారికి ఇక్క‌డి ప్ర‌జ‌లు క‌ష్టాలు ప‌ట్ట‌డం లేదు.  సోమ‌శిల జ‌లాలు నెల్లూరు జిల్లా నుంచే వెళ్తున్నా తాగునీరు, సాగునీరు అందే ప‌రిస్థితులు లేవు.  చాలా గ్రామాలు ఇప్ప‌టికీ దాహంతో అల్లాడిపోతున్నాయి. తాగేందుకు ర‌క్షిత‌మంచినీరు లేక కొన్ని గ్రామాల్లో ఫ్లోరోసిస్ వివిజృంభిస్తుంది. ప్ర‌జ‌ల కోసం నీటిని తెచ్చుకోవ‌డం చేత‌కాదు గానీ, ఉన్న నాలుగు ఎక‌రాల చెరువుని మాత్రం క‌బ్జా చేసేస్తారు. కావ‌లి ప్ర‌జ‌లు ఇంత ఇబ్బందులు ప‌డుతుంటే ఒక నాయ‌కుడు బెంగ‌ళూరు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటారు. ఇంకో నాయ‌కుడు క‌బ్జాల్లో బిజీగా ఉన్నారు. మ‌రి ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ప‌ట్టించుకునేది ఎవ‌రు. మ‌ళ్లీ కావ‌లి వ‌స్తా. జ‌న‌సేన అభ్య‌ర్ధిని గెలిపించి మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా.  రైతులు ఒక‌వైపు గిట్టుబాటు ధర లేక‌, మ‌రోవైపు ద‌ళారీ వ్య‌వ‌స్థ‌తో మోస‌పోతున్నారు.  మంత్రిగారికి ప్ర‌జ‌ల‌ బాధ‌లు ప‌ట్ట‌డం లేదు. నేను సింహ‌పురి బిడ్డ‌నే. ఇక్క‌డే పెరిగాను. ఎమ్మెల్యే కాదు క‌దా పంచాయితీ మెంబ‌ర్ కూడా లేకుండా ఉద్ధానం స‌మ‌స్య‌ను తీర్చాం. కావ‌లి, జిల్లాలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నుంచి జ‌న‌సేన అభ్య‌ర్ధుల‌ను చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపుదాం. బ‌డుగు, బ‌ల‌హీన వ్య‌క్తుల‌ను గెలిపిద్దాం. నూత‌న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను నిర్మిద్దాం. మంచి ప‌నులు చేయాలంటే రాజ‌కీయ అధికారం అవ‌స‌రం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here