Home Political News మావోయిస్టుల గురి – ఆ రెండు పార్టీల నేత‌ల పైనే..!

మావోయిస్టుల గురి – ఆ రెండు పార్టీల నేత‌ల పైనే..!

88
0

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చిన‌ మావోయిస్టు పార్టీ, ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు పథకం రూపొందించినట్టు తెలిసింది. అయితే… ముందస్తు భద్రతా చర్యలను చేపట్టిన తెలంగాణ పోలీస్, సీఆర్‌పీఎఫ్‌ మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేసింది. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అంద‌డంతో పోలీస్ శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. మావోయిస్టులు టీఆర్ఎస్, బీజేపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.

ఈ ఏడాది మార్చిలో ఖమ్మం జిల్లా వెంకటాపురం, వాజేడు ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా పాతిపెట్టిన ల్యాండ్‌మైన్లను బలగాలు కూంబింగ్‌లో భాగంగా నిర్వీర్యం చేశాయి. అయితే… భారీ స్థాయిలో ఒక వైపు సీఆర్‌పీఎఫ్, మరోవైపు గ్రేహౌండ్స్, స్పెషల్‌ పార్టీలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నప్పటికీ మావోయిస్టు పార్టీ మళ్లీ ల్యాండ్‌మైన్లను అమర్చడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ తో మావోయిస్టులు సానుకూలంగా ఉన్న‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ నేత‌ల పై పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు నిఘా పెట్టిన‌ట్టు తెలిసింది. తెలంగాణ‌తో పాటు ఎన్నిక‌లు జ‌రిగే నాలుగు రాష్ట్రాల‌ను ఐబీ శాఖ హెచ్చ‌రించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here