Home Actor “మా” అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసిన న‌రేష్ – అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన జీవితా రాజ‌శేఖ‌ర్.!

“మా” అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసిన న‌రేష్ – అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన జీవితా రాజ‌శేఖ‌ర్.!

119
0


మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు (మా) ఎన్నిక‌లు ఇటీవ‌ల జ‌ర‌గ‌డం..న‌రేష్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ్వ‌డం తెలిసిందే. మా మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా ప‌ద‌వీ కాలం మార్చి 31 వ‌ర‌కు ఉన్న‌ప్ప‌టికీ మార్చి 22నే ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని న‌రేష్ ప‌ట్టుబ‌ట్ట‌డం వివాద‌స్ప‌ద‌మైంది. ఆఖ‌రికి న‌రేష్ అనుకున్న‌ట్టుగానే ఈ రోజు మా అధ్య‌క్షుడిగా న‌రేష్ ప్రమాణ స్వీకారం చేసారు. కృష్ణ, కృష్ణంరాజు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

ఈ సినీ పెద్ద‌ల స‌మ‌క్షంలోనే మా అధ్య‌క్షుడు న‌రేష్ పై ఉపాధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్ అసంతృప్తి వ్య‌క్తం చేసారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే…ప్రమాణ స్వీకార సందర్భంగా న‌రేష్ మాట్లాడుతూ… తన ప్రసంగంలో మేము అనకుండా పదే పదే నేను అనడం రాజశేఖర్‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించింది. ‘మా’ అంటే అందరిదీ కానీ.. అది తానొక్కడిదే అన్న తరహాలో నరేష్‌ నేను.. నేను అంటూ వచ్చారని రాజశేఖర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. నరేష్ అన్నీ మాట్లాడేశారని.. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడటం తనకు ఇష్టం లేదంటూ రాజ‌శేఖ‌ర్ మైక్ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయారు.

ఆతర్వాత జీవిత చేతిలో నుంచి రాజ‌శేఖ‌ర్ మైక్ తీసుకుని తాను మాట్లాడేందుకు చాలా ఉందని, ఓపిక ఉంటే వినవచ్చని అన్నారు. నేను అని కాకుండా మేము అని నరేష్ మాట్లాడాలన్నారు.  ఈ కార్యక్రమానికి తాను రావాలనుకోలేదని, నరేష్ వచ్చి పిలిస్తేనే వచ్చానని, ఆయన తనకు మంచి మిత్రుడు కాబట్టే వచ్చానని చెప్పారు. అంతే కాకుండా ఇక పై నరేష్ మేము అని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.

రాజ‌శేఖ‌ర్ మాటల‌కు పక్కనే ఉన్న నరేష్ స్పందిస్తూ.. తానేదో సరదాగా అన్నానని, మన మందరం కలిసే పని చేద్దామంటూ రాజశేఖర్ ను సర్ధిచెప్పే ప్ర‌య‌త్నం చేసారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ను మా టీమ్ న‌రేష్ క‌లిసిన‌ప్పుడు వాళ్ల‌లో జీవితా రాజ‌శేఖ‌ర్ లేక‌పోవ‌డం, ఇప్పుడు బ‌హిరంగంగానే రాజ‌శేఖ‌ర్ న‌రేష్ పై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం..ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here