Home Political News మా ఎమ్మెల్యేలు పార్టీ మార‌డం లేదు. అది టీఆర్ఎస్ మైండ్ గేమ్. కాంగ్రెస్ నేత గండ్ర...

మా ఎమ్మెల్యేలు పార్టీ మార‌డం లేదు. అది టీఆర్ఎస్ మైండ్ గేమ్. కాంగ్రెస్ నేత గండ్ర వెంక‌ట‌ ర‌మ‌ణారెడ్డి.

88
0

టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…త‌మ పార్టీలో చేరేందుకు చాలా మంది నాయ‌కులు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌క‌టించారు. దీంతో కాంగ్ర‌స్, టీడీపీ నాయ‌కులు టీఆర్ఎస్ లో చేర‌నున్నారంటూ ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ…అధికార పార్టీకి ప్రజాస్వామ్యం పై విశ్వాసం లేదని, ఎమ్మెల్సీల విషయంలో టీఆర్ఎస్‌ ఆకర్ష్ రానురాను వికర్ష్‌గా మారే అవకాశం ఉందని చెప్పారు.

 ఎమ్మెల్యేలను ఆకర్షించే పనులు పక్కనపెట్టి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. సీఎల్పీ లీడర్‌గా తానూ అర్హుడినే అని గండ్ర తెలిపారు. సీఎల్పీ లీడర్‌గా పార్టీ అవకాశమిస్తే సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌నుకోవ‌డం నియంతృత్వ ధోర‌ణి. ప్ర‌జాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేర‌డం లేదు. అది టీఆర్ఎస్ మైండ్ గేమ్ మాత్రేమే అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here