Home Actor మా జ‌న‌రేష‌న్ లోనే జ‌రిగింది..కార‌ణం జ‌క్క‌న్నే – తార‌క్..!

మా జ‌న‌రేష‌న్ లోనే జ‌రిగింది..కార‌ణం జ‌క్క‌న్నే – తార‌క్..!

84
0


ఇది జ‌క్క‌న్న‌తో నాలుగ‌వ చిత్రం. అన్నింటి కంటే ఈ చిత్రం చాలా స్పెష‌ల్ ఫిల్మ్ గా కెరీర్ లో మిగిలిపోతుంది అని తార‌క్ ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. జ‌క్క‌న్న‌తో మాట్లాడ‌డం..చ‌ర‌ణ్ తో స్ర్కీన్ షేర్ చేసుకోవ‌డం..చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పారు. చ‌ర‌ణ్ తో ఫ్రెండ్ షిప్ ఈ సినిమాతో ప్రారంభం కాలేదని…ఈ సినిమా కంటే ముందు నుంచి ఫ్రెండ్స్ షిప్ ఉంది. ఈ సినిమా చేసే స‌రికి వేరే లెవ‌ల్ కి వెళ్లింది. అల్లూరి సీతారామ‌రాజు గురించి..కొమ‌రం భీమ్ గురించి ఒక గీత ఉంది. వాళ్లిద్ద‌రు క‌లిసుంటే ఏం జ‌రిగి ఉండేది అనే ఆలోచ‌న చాలా బాగా న‌చ్చింది అన్నారు.

ఈ చిత్రం మా ఇద్ద‌రికీ న‌టుడుగా ఎద‌గ‌డానికి ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. ఈ చిత్రానికి చేసిన వ‌ర్క్ షాప్స్ ట్రైనింగ్ పెంటాస్టిక్. ఇక నుంచి చేసే సినిమాల‌కు కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. గ్రేట్ క్యారెక్ట‌ర్స్. త‌ప్ప‌కుండా ఆయ‌న బ్రైన్ నుంచి వ‌చ్చిన ఈ థాట్ 101% గొప్ప చిత్రంగా నిలుస్తుంద‌ని ప్ర‌గాఢ విశ్వాసం. ఎటువంటి భేష‌జాలు లేకుండా చ‌ర‌ణ్ ఒప్పుకున్నందుకు హ్య‌ట్సాఫ్. మా జ‌న‌రేష‌న్ లో ఇది జ‌రిగింది. ఓన్లీ జ‌క్క‌న్న వ‌ల‌నే ఇది జ‌రిగింది అని తార‌క్ తెలియ‌చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here