Home Actor మిస్ట‌ర్ మ‌జ్ను గురించి రామ్ చ‌ర‌ణ్ రియాక్ష‌న్..!

మిస్ట‌ర్ మ‌జ్ను గురించి రామ్ చ‌ర‌ణ్ రియాక్ష‌న్..!

127
0

అక్కినేని అఖిల్ న‌టించిన లేటెస్ట్ మూవీ మిస్ట‌ర్ మ‌జ్ను. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ కి అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను పాజిటివ్ టాక్ ఉంది. అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టించింది. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లు ఆల్రెడీ హిట్ అవ్వ‌డంతో సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా మిస్ట‌ర్ మ‌జ్ను గురించి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ…ట్రైల‌ర్ ప్రామిసింగ్ గా ఉంది. అఖిల్, నిధి అగ‌ర్వాల్, డైరెక్ట‌ర్ వెంకీ, నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ మ‌రియు చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఈ మూవీ ట్రైల‌ర్ 6 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌రి..ఈ నెల 25న రానున్న మిస్ట‌ర్ మ‌జ్ను బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించ‌నుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here