Home Actor మిస్ట‌ర్ మ‌జ్ను రివ్యూ

మిస్ట‌ర్ మ‌జ్ను రివ్యూ

146
0

అక్కినేని అఖిల్ న‌టించిన తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అఖిల్, హ‌లో.. చిత్రాలు ప్లాప్ అవ్వ‌డంతో ఈ సినిమా పై అక్కినేని అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రం ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి..మిస్ట‌ర్ మ‌జ్ను అఖిల్ కి తొలి విజ‌యాన్ని, వెంకీ అట్లూరికి రెండో విజ‌యాన్ని అందించిందా..?   లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే..!

క‌థ –  విక్ర‌మ్ కృష్ణ (అఖిల్) యు.ఎస్ లో చదువుకుంటాడు. ఏ అమ్మాయినైనా స‌రే…త‌న మాట‌ల‌తో ఇట్టే ప‌డేస్తాడు. ఇక నిక్కీ (నిధి అగ‌ర్వాల్) త‌న‌కు శ్రీరాముడు లాంటి భ‌ర్త రావాలి అనుకుంటుంది. ఆమెకు విక్ర‌మ్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అయితే..ఇద్దరూ అనుకోకుండా ఒకేసారి ఇండియాకు వ‌స్తారు. ఇండియాకి వ‌చ్చాకా ఎయిర్ పోర్ట్ లో విక్ర‌మ్ – నిక్కీ కాబోయే చుట్టాలు అని తెలుస్తుంది. నిక్కీ అన్న‌య్య (రాజా) విక్ర‌మ్ చెల్లెలుకు పెళ్లి. ఆ విధంగా వీరిద్ద‌రు చుట్టాల‌వుతారు. విక్ర‌మ్ గురించి పూర్తిగా తెలిసిన‌ప్ప‌టికీ నిక్కీ…విక్ర‌మ్ ప్రేమ‌లో ప‌డుతుంది. ఈ విష‌యం పెద్ద‌ల‌కు తెలిసి వీరిద్ద‌రికీ పెళ్లి చేయ‌డానికి ఓకే చెబుతారు. అయితే..విక్ర‌మ్ మాత్రం నిక్కీని పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేద‌ని చెబుతాడు. ఎందుకు విక్ర‌మ్ అలా చెప్పాడు..? ఆత‌ర్వాత నిక్కీ ఏం చేసింది..?  చివ‌ర‌కి ఏమైంది అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

అఖిల్ న‌ట‌న‌

ఫ్యామిలీ ఎమోష‌న్స్

కామెడీ

డైలాగులు

త‌మ‌న్ మ్యూజిక్

మైన‌స్ పాయింట్స్

పాత క‌థ‌

అక్క‌డ‌క్క‌డా స్లోగా ఉండ‌డం..

విశ్లేష‌ణ – అఖిల్ న‌టించిన అఖిల్, హ‌లో చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా పై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే…ఈ చిత్రానికి తొలిప్రేమ తో తొలిప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించిన వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు కావ‌డంతో సినిమా పై బిగినింగ్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాల్సింది అఖిల్ గురించే. డ్యాన్స్, ఫైట్స్, రొమాంటిక్ & ఎమోష‌నల్ సీన్స్ ల‌లో అఖిల్ అద్భుతంగా న‌టించాడు. ఈ సినిమా టీజ‌ర్ & ట్రైల‌ర్ చూసి పాత సినిమాలు గుర్తొస్తున్నాయి.

సినిమా ఎలా ఉంటుందో అనే సందేహం ఏర్ప‌డింది కానీ..డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి చాలా ఎంట‌ర్ టైనింగ్ గా ఉండేలా తెర‌కెక్కించ‌డంలో స‌క్స‌స్ అయ్యాడ‌ని చెప్ప‌చ్చు. ఫ‌స్టాఫ్ లో ఫాద‌ర్ – స‌న్ మ‌ధ్య చిత్రీక‌రించిన ఎమోష‌న‌ల్ సీన్ అంద‌ర్నీ ట‌చ్ చేస్తుంది. ఇలాంటి సీన్స్ సెకండాఫ్ లో కూడా ఉంటే ఇంకా బాగుండేది. హైప‌ర్ ఆది, ప్రియ‌ద‌ర్శిని కామెడీ బాగుంది. అయితే… అన్న‌య్య ఇంట్లో పెళ్లి జ‌రిగితే త‌మ్ముడు సుబ్బ‌రాజు ఎందుకు వెళ్ల‌లేదు..?  వెళ్ల‌క‌పోయినా త‌మ బంధువు విక్ర‌మ్ కృష్ణ గురించి తెలియ‌కుండా ఉంటుందా..?  అనే సందేహాలు వ‌స్తుంటాయి. సెకండాఫ్ లో క‌థ ముందుకు వెళ్ల‌డం లేదేంటి అనిపిస్తుంటుంది. స్ర్కిప్ట్ లో ఇంకొంచెం వ‌ర్క్ చేసుంటే బాగుండేది. జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ, త‌మ‌న్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్స్ అని చెప్ప‌చ్చు. లాజిక్కులు గురించి ఆలోచించ‌కుండా చూస్తే..యూత్ కి ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది.

రేటింగ్ – 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here