Home Political News మీ క్షేమం నా ప్ర‌థ‌మ బాధ్య‌త – ప‌వ‌న్ క‌ళ్యాణ్

మీ క్షేమం నా ప్ర‌థ‌మ బాధ్య‌త – ప‌వ‌న్ క‌ళ్యాణ్

101
0

కాటన్ బ్యారేజి పై చేపడుతున్న కవాతు సందర్భంగా తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై పవన్ కళ్యాణ్  ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కవాతుకు ఏర్పాట్లను  సమీక్షించిన ప్రతి సమావేశంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి జన సైనికుడు క్షేమంగా ఇంటికి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా నాయకులకు చెప్పారు. రక్షణ చర్యల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. బ్యారేజి పొడవునా, సభ జరిగే చోట – ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన 2 వేల మంది జనసేన కార్యకర్తలు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. కవాతుకు హాజరయ్యేవారందరికీ  పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరాలి. ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్దాం. కలిసి నడుద్దాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండండి. మీ క్షేమం నాకు ప్రథమ బాధ్యత. బైకుల్లో స్పీడ్ గా వెళ్ళేటప్పుడు మీ తల్లితండ్రులనీ, నన్ను గుర్తుపెట్టుకోండి. నిదానంగా రండి అని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు జనసైనికులు రక్షణ కవచంలా నిలవాలని పిలుపునిచ్చారు.పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా వైపు నుంచి వచ్చే వాహనాలకు విజ్జేశ్వరం దగ్గర పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఉత్తరాంధ్ర వైపు నుంచి వచ్చే వాహనాలకు ధవళేశ్వరం, వేమగిరి దగ్గర పార్కింగ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here