Home Political News ముంద‌స్తు ఎన్నిక‌ల పై సుప్రీం కోర్టులో పిటిష‌న్..!

ముంద‌స్తు ఎన్నిక‌ల పై సుప్రీం కోర్టులో పిటిష‌న్..!

117
0
TH08BRIEFLY1AGNS2Q3KDI3jpgjpg

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. కేసీఆర్ మాత్రం విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకుండా పార్టీ నాయ‌కుల ప్ర‌చారం ఎలా జ‌రుగుతుందో ఎప్ప‌టిక‌ప్పుడూ తెలుసుకుంటున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డం..కాంగ్రెస్, తెలుగుదేశం మ‌హా కూట‌మిగా ఏర్ప‌డ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఇదిలా ఉంటే…తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల పై సిద్దిపేట వాసుల త‌రుపున న్యాయ‌వాది చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేసారు.

గ‌డువు కంటే ముందుగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల‌న 20 శాతం మంది ఓటు హ‌క్కు కోల్పోతున్నామ‌ని పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఎన్నిక‌ల అంశం పై సీఎం వ్యాఖ్య‌ల‌ను కూడా ఈ పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఈసీతో చ‌ర్చంచి ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్టు సీఎం ప్ర‌క‌టించ‌డం పై పిటిష‌న‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. సీఎం ప్ర‌క‌ట‌న అనుమానాల‌కు తావిచ్చేదేలా ఉంద‌న్నారు. ఏపీలో విలీన‌మైన 7 మండ‌లాల ఓట‌ర్ల భ‌విష్య‌త్ ఏంట‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ పాల‌న విధించి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సుప్రీం కోర్టుకు విజ్ఞ‌ప్తి చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here