Home Actor ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌రుక్ష‌ణ‌మే నేను చేసే ప‌ని అదే..! – ప‌వన్ క‌ళ్యాణ్.!

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌రుక్ష‌ణ‌మే నేను చేసే ప‌ని అదే..! – ప‌వన్ క‌ళ్యాణ్.!

81
0


జ‌న‌సేన పార్టీ అధికారంలో వ‌స్తే .. తెలుగుదేశం పార్టీలా చంద్ర‌న్న ప‌థ‌కాలు, కాంగ్రెస్ పార్టీలా ఇందిర‌మ్మ ప‌థ‌కాలు అని సంక్షేమ ప‌థ‌కాల‌కు పేర్లు పెట్ట‌మ‌ని, స‌మాజానికి మేలు చేసిన మ‌హానుభావులు ప్ర‌కాశం పంతులు గారు, పొట్టి శ్రీరాములు వంటి మ‌హానుభావుల పేర్లు పెడ‌తామని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ జోన్లు ఏర్పాటు చేసి ల‌క్ష‌మంది యువ‌ రైతుల‌ను త‌యారు చేస్తాం. 3 ల‌క్ష‌ల బ్యాక్ లాగ్ పోస్టుల‌ను ఆరు నెల‌ల్లో భ‌ర్తీ చేస్తాం. పోలీస్ శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డంతో పాటు బ‌ల‌మైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ కోసం 25 వేల మందితో స్పెష‌ల్ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ జారీ చేస్తాం. రాష్ట్రంలో మూత‌ప‌డ్డ స‌హ‌కార రంగంలో ఉన్న అన్ని మిల్లుల‌ను తెరిపిస్తాం. ప‌రిశ్ర‌మ‌ల ఆస్తులు రాజ‌కీయ నాయ‌కులు దోచేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటాం అన్నారు.

ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మ‌రుక్ష‌ణ‌మే నా మొద‌టి సంత‌కాన్ని రైతుల‌కి నెల‌కి రూ. 5 వేల ఫించ‌న్ ఇచ్చే ప‌థ‌కం మీద పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నా. దీంతో పాటు ఎలాంటి హామీ ప‌త్రాలు లేకుండా రైతులంద‌రికీ ఏడాదికి ఎక‌రానికి రూ. 8 వేల చొప్పున సాగు సాయం అంద‌చేస్తాం. కుటుంబ స‌భ్యుల సంఖ్య ఆధారంగా, ఆదాయంతో సంబంధం లేకుండా ఆడ‌ప‌డుచుల‌కు ఉచిత గ్యాస్ అందించే  ప‌థ‌కం మీద రెండో సంత‌కం చేస్తాం. ఏడాదికి ఆరు నుంచి ప‌ది సిలిండ‌ర్లు ఉచితంగా జ‌న‌సేన ప్ర‌భుత్వం అంద‌చేస్తుంది.

త‌దుప‌రి సంత‌కం రేష‌న్ బియ్యం, ప‌నికిరాని పామాయిల్‌తో ఇబ్బందులు ప‌డుతున్న మీకోసం రేష‌న్‌కి బ‌దులు రూ. 2500 నుంచి రూ. 3500 వంద‌లు మ‌హిళ‌ల ఖాతాల‌కి జ‌మ చేసే ప‌థ‌కం పై పెడ‌తానని హామీ ఇచ్చారు.  టీడీపీ, వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లాలో బెట్టింగుల కోసం కలలు కంటుంటే మన నెల్లూరు రూరల్ అభ్యర్థి శ్రీ మనుక్రాంత్ రెడ్డి ఐటీ కంపెనీ పెట్టి ఉపాధి కలిపిస్తున్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థి వినోద్ రెడ్డి నెల్లూరు సమస్యలు పైన పోరాటం చేస్తున్నాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వినోద్ రెడ్డిని అభ్యర్థిగా మీ ముందు నిలిపాం. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి వీరిద్ద‌రిని అఖండ మెజార్టీతో గెలిపించాల‌”ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here