Home Political News మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి – జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్..!

మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి – జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్..!

89
0

హైకోర్టు ఆదేశాలను గౌరవించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. స్థానిక సంస్థల అధికారాలను నిలబెట్టేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం హర్షించదగిన పరిణామం అన్నారు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కాల వ్యవధి ముగిసిన తరవాత ప్రత్యేక అధికారుల పాలన తీసుకురావడం సరైన విధానం కాదని చెబుతూనే ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల్లో నిలబడే ధైర్యం లేకపోయింది. అందుకే జీవో నెం.90 తీసుకొచ్చింది. ప్రజలచే ఎన్నికయ్యే ప్రతినిధులు లేకపోతే స్థానిక సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయి? అని ప్ర‌శ్నించారు.

ప్రజలు తమకు ఎదురయ్యే ఇబ్బందుల పై ఎవరికి చెప్పుకొంటారు అనేది ఆలోచన చేయకుండా ప్రభుత్వం తమ రాజకీయ లబ్ది కోసమే ఆ ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పారు. ప్రత్యేకాధికారుల పాలన అయితే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. ఇలాంటి ఉత్తర్వులు పంచాయతీరాజ్ చట్టాన్ని నవ్వులపాల్జేస్తాయి. మాజీ సర్పంచ్ లు వేసిన పిటీషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆ చట్టాన్ని రక్షించేలా ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హైకోర్టు చెప్పిన విధంగా మూడు నెలల్లోగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here