Home Actor మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో న‌రేష్ విజయం..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో న‌రేష్ విజయం..!

114
0


మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి శివాజీరాజా, న‌రేష్ మ‌ధ్య హోరాహోరి పోటీ జ‌రిగింది. ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓటింగ్ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు జ‌రిగింది. ఇందులో 745 ఓట్లు ఉండ‌గా ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్ధాయిలో 472 మంది ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. దీంతో ఎవ‌రు గెలుస్తారు అనే ఉత్కంఠ ఏర్ప‌డింది. అయితే..సాయంత్రం 4 గంట‌ల‌కు ప్రారంభ‌మైన లెక్కింపు అర్ధరాత్రి వ‌ర‌కు కొనసాగింది.

ఈ ఎన్నిక‌ల్లో తొలి ఓటు న‌రేష్ వేయ‌గా..చివ‌రి ఓటును రాజ‌బాబు సోద‌రుడు చిట్టిబాబు వేసారు. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డిన శివాజీరాజాకు 199 ఓట్లు రాగా, న‌రేష్ కు 268 ఓట్లు వ‌చ్చాయి. 69 ఓట్లు మెజార్టీతో శివాజీరాజా పై న‌రేష్ గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ పై రాజశేఖర్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జనరల్ సెక్రటరిగా రఘుబాబు పై జీవిత రాజశేఖర్ గెలుపొందారు. జాయింట్  సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించారు. ట్రెజరర్‌గా కోట శంకర్రావు పై  రాజీవ్ కనకాల గెలుపొందారు.

విజ‌యం సాధించిన‌ ఈసీ మెంబ‌ర్స్…1) ఆలీ, 2) ర‌విప్ర‌కాష్ 3) త‌నికెళ్ల‌భ‌ర‌ణి 4) సాయికుమార్ 5) ఉత్తేజ్ 6) పృథ్వీ 7) జాకీ, 8) సురేష్ కొండేటి 9) అనితా చౌద‌రి 10) అశోక్ కుమార్ 11) స‌మీర్ 12) ఏడిద శ్రీరామ్ 13) రాజా రవీంద్ర 14) త‌నీష్ 15) జ‌య‌ల‌క్ష్మి 16) క‌రాటే క‌ళ్యాణి 17) వేణుమాధ‌వ్ 18) ప‌సునూరి శ్రీనివాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here