Home Actor మెగాస్టార్ తో దిల్ రాజు సినిమా. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు..?

మెగాస్టార్ తో దిల్ రాజు సినిమా. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు..?

42
0
మెగాస్టార్ తో దిల్ రాజు సినిమా. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు..? spiceandhra

ఓ వైపు చిన్న సినిమాలు.. మ‌రో వైపు పెద్ద సినిమాలు.. చేస్తూ..ఎన్నో విజ‌యాలు అందుకున్న అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు. ఆయ‌న సీనియ‌ర్ హీరోల్లో నాగార్జున‌తో గ‌గ‌నం, వెంక‌టేష్ తో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చేసారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌ల‌తో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా చేయ‌లేదు. ఎప్ప‌టి నుంచో చిరంజీవితో సినిమా చేయాల‌నుకుంటున్నారు కానీ… కుద‌ర‌లేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఇప్పుడు చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యం ఇటీవ‌ల దిల్ రాజు చిరుకు చెబితే వెంట‌నే ఓకే అన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం దిల్ రాజు చిరు కోసం క‌థ రెడీ చేయిస్తున్నార‌ట‌. చిరు సైరా సినిమా చేస్తున్నారు. అక్టోబ‌ర్ 2న సైరా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత చిరు బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు.

వైవిధ్య‌మైన క‌థాంశంతో  రూపొందే ఈ భారీ చిత్రం షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే… కొర‌టాల శివ‌తో చేస్తున్న సినిమా త‌ర్వాత చిరు దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేయ‌చ్చు అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి.. ఈ క్రేజీ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here