Home Actor మెగాస్టార్ మేన‌ల్లుడు వైష్ట‌వ్ తేజ్ హీరోగా సినిమా ప్రారంభం..!

మెగాస్టార్ మేన‌ల్లుడు వైష్ట‌వ్ తేజ్ హీరోగా సినిమా ప్రారంభం..!

89
0

మెగాస్టార్ మేన‌ల్లుడు.. సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు..  వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు అని గ‌త కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. రంగ‌స్థ‌లం సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో  వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమాను రూపొందుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. జాలరి వేషధారణలో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమ‌య్యింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రై చిత్ర యూనిట్ కు ఆశీస్సులు అంద‌చేసారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ .. 2009 లో హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి నేను నటన పరంగా చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు 2019లో మా లిటిల్ బ్రదర్ వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నాడు. నన్ను ఆదరించినట్టే నా సోదరుడిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here