Home Actor మెగాస్టార్ రికార్డ్ ను సూప‌ర్ స్టార్ బ్రేక్ చేయ‌నున్నాడా..?

మెగాస్టార్ రికార్డ్ ను సూప‌ర్ స్టార్ బ్రేక్ చేయ‌నున్నాడా..?

86
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ సెన్సేష‌న్ మ‌హ‌ర్షి. ఇది మ‌హేష్ కి 25వ చిత్రం. అందుచేత అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ ఈ ముగ్గురు క‌లిసి ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న‌ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ..మ‌హ‌ర్షి చిత్రం త‌ర్వాత భారీ చిత్రాలు రిలీజ్ కాక‌పోవ‌డం..వ‌చ్చిన సినిమాలు ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో మ‌హ‌ర్షి చిత్రం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం…మ‌హ‌ర్షి 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 101 కోట్లు షేర్ క‌లెక్ట్ చేసింద‌ని తెలిసింది. టాలీవుడ్ లో 100 కోట్ల క్ల‌బ్ లో బాహుబ‌లి 2, బాహుబ‌లి, రంగ‌స్థ‌లం, ఖైదీ నెం 150.. ఇప్పుడు మ‌హ‌ర్షి చేరాయి. అయితే… ఖైదీ నెం 150 చిత్రం 102 కోట్లు షేర్ వ‌సూలు చేసింది. మ‌హ‌ర్షి చిత్రం త్వ‌ర‌లో  ఖైదీ నెం 150 క‌లెక్ట్ చేసిన 102 కోట్ల‌ షేర్ ను క్రాస్ చేసే ఛాన్స్ ఉంద‌ని సినీ పండితులు చెబుతున్నారు. మ‌హ‌ర్షి ఫుల్ ర‌న్ లో ఎంత క‌లెక్ట్ చేస్తుందో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here