Home Actor మెగా హీరో మూవీ టైటిల్ ఇదే..!

మెగా హీరో మూవీ టైటిల్ ఇదే..!

70
0

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవ‌ల చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వ‌రుసగా ఫ్లాప్ చిత్రాల‌తో కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డిన తేజు న‌టించిన చిత్ర‌ల‌హ‌రి చిత్రం ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోయినా .. ఫ‌ర‌వాలేద‌నిపించింది. త‌దుప‌రి చిత్రాన్ని యూత్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతితో చేయ‌నున్నారు.  లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి భోగి అనే టైటిల్ ను పరిశీలించారు. అయితే… ఈ టైటిల్ స‌రిగా ఫీడ్ బ్యాక్ రాలేదట. దీంతో సినిమా యూనిట్ అంతా కలిసి ప్రతిరోజు పండగే అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలిసింది. ఈ  టైటిల్ కి దర్శక నిర్మాతలతో పాటు, సాయిధరమ్ తేజ్ కూడా ఓకే చెప్ప‌డంతో ఈ టైటిల్ నే ఖ‌రారు చేయ‌నున్నారు.

ఈ సినిమాలో తేజు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. క‌థానాయిక ఎవ‌రు అనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల ఎంపిక పూర్తి చేసి షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here