Home Reviews మెహ‌బూబా రివ్యూ..!

మెహ‌బూబా రివ్యూ..!

261
0

పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. పూరి…త‌న‌యుడు ఆకాష్ పూరిని పూర్తి స్ధాయి హీరోగా..కొత్త అమ్మాయి నేహాశెట్టిని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేస్తూ ఈ సినిమాని రూపొందించాడు. 1971 ఇండో – పాక్ వార్..దీనికి తోడు పున‌ర్జ‌న్మ నేప‌ధ్యంతో మెహ‌బూబా సినిమా రూపొందించ‌డంతో పూరి గ‌త చిత్రాలకు భిన్నంగా ఉంటుంద‌నిపించింది. దీనికి తోడు దిల్ రాజు ఈ సినిమాని చూసి న‌చ్చ‌డంతో త‌న సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూష‌న్ చేయ‌డంతో మెహ‌బూబా పై పాజిటివ్ టాక్ ఏర్ప‌డింది. అంతే కాకుండా…ఈ సినిమాతో పూరి ఈజ్ బ్యాక్ అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. మ‌రి…స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురుచూస్తోన్న పూరికి మెహ‌బూబా ఎలాంటి ఫ‌లితాన్ని అందించింది..? పూరి ఈజ్ బ్యాక్ అనేది నిజ‌మా..? ఆకాష్ పూరి హీరోగా మెప్పించాడా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే..!

క‌థ – చిన్న‌ప్ప‌టి నుంచి దేశ‌భ‌క్తి గ‌ల‌ యువ‌కుడు రోష‌న్ (ఆకాష్ పూరి). ఇంజ‌నీరింగ్ చ‌దివినా…మిల‌ట‌రీలో జాయిన్ అవ్వాల‌నుకుంటాడు. అయితే…రోష‌న్ కి చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌ను ఎవ‌రో చంపేసార‌నే క‌ల వ‌స్తుంటుంది. కానీ..పెద్ద‌గా ప‌ట్టించుకోడు. మిల‌ట‌రీలో చేరే ముందు త‌న స్నేహితుల‌తో క‌లిసి హిమాల‌యాల‌కు ట్రెక్కింగ్ కి వెళ‌తాడు. త‌ను ఎవ‌ర్నీ ప్రేమించ‌క‌పోయినా…ఎవ‌రితోనో ప్రేమ‌లో ఉన్న‌ట్టు అనిపిస్తుంది అని స్నేహితుల‌తో చెబుతుంటాడు. ఇదిలా ఉంటే…పాకిస్ధాన్ లో పుట్టిన అఫ్రిన్…(నేహాశెట్టి) చ‌దువుకోవ‌డం కోసం ఇండియా వ‌స్తుంది. త‌ను ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు రోష‌న్ కాపాడ‌తాడు కానీ..త‌ను ర‌క్షించింది ఎవ‌రో ఆమెకి తెలియ‌దు. ఇక హిమాల‌యాల‌కు వెళ్లిన రోష‌న్ కి అఫ్రిన్ శ‌వమై క‌నిపిస్తుంది. అది చూసి షాకైన‌ రోష‌న్ కి త‌న గ‌తం గుర్తుకొస్తుంది. అస‌లు.. ఆఫ్రిన్ ని ఎవ‌రు చంపారు..? అది తెలుసుకుని రోష‌న్ ఏం చేసాడు అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్
ఆకాష్ పూరి – నేహాశెట్టి న‌ట‌న‌
పూరి డైలాగ్స్
1971 ఇండో – పాక్ వార్ ఎపిసోడ్

మైన‌స్ పాయింట్స్
క్లైమాక్స్ లెంగ్త్ ఎక్కువ అవ్వ‌డం..
చ‌నిపోయి మ‌ళ్లీ పుట్ట‌డం అనే పాత క‌థ‌
లాజిక్స్ మిస్ అవ్వ‌డం..

విశ్లేష‌ణ – వ‌రుస ఫ్లాప్స్ తో స‌త‌మ‌త‌మౌతోన్న పూరి ఈసారి ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌నే క‌సితో మెహ‌బూబా చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు పూరి తీసిన సినిమాలు ఒక ఎత్తు..ఇది ఒక ఎత్తు. ఎందుకంటే…ఈ సినిమా ద్వారా త‌న‌యుడు ఆకాష్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేసారు. ఇంకా చెప్పాలంటే… పూరికి ఈ సినిమా అగ్ని ప‌రీక్ష‌. ఇలాంటి టైమ్ లో పూరి పున‌ర్జ‌న్మ క‌ధాంశం ఎంచుకుని..దీనికి 1971 ఇండో – పాక్ వార్ మిక్స్ చేసాడు. హీరో ఆకాష్ పూరి..ఏ సీన్ లోను కొత్తబ్బాయిగా క‌నిపించ‌లేదు. ఎన్నో సినిమాలు చేసిన అనుభ‌వం ఉన్న న‌టుడులా పాత్ర‌కు ప్రాణం పోసి శ‌భాష్ అనిపించుకున్నాడు. ల‌వ్, యాక్ష‌న్, ఎమోష‌న్…ఇలా సీన్ ఏదైనా స‌రే… అద్భుతంగా న‌టించి..ఆడియ‌న్స్ ని ఇన్ వాల్వ్ చేసాడు. అలాగే హీరోయిన్ నేహాశెట్టి కూడా చాలా బాగా న‌టించింది. ఇక పూరి డైలాగులు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆకాష్ డైలాగులు చెబుతుంటే…పూరియే తెర పైకి వ‌చ్చి మాట్లాడుతున్నాడా..? అనిపిస్తుంటుంది.

ముఖ్యంగా ఇండియా, పాకిస్ధాన్ కి సంబంధించిన డైలాగులు, క్లైమాక్స్ లో వ‌చ్చే డైలాగులు ఆడియ‌న్స్ తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తున్నాయి. వార్ సీన్స్ ఈ సినిమాకి ప్ర‌త్యేకార్ష‌ణ‌గా చెప్ప‌చ్చు. నిర్మాణ‌ప‌రంగా ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ సినిమాని నిర్మించారు. అది ప్ర‌తి ఫ్రేమ్ లో క‌నిపిస్తుంది. అయితే…అక్క‌డ‌క్క‌డా కాస్త స్లో అయినా… బోర్ అనే ఫీల్ లేకుండా గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ఇంట్ర‌స్టింగ్ గా ఉండేలా తెర‌కెక్కించారు. కానీ…పాకిస్ధాన్ కి వెళ్లి హీరోయిన్ ని హీరో తీసుకురావ‌డం అనేది రియ‌లిస్టిక్ గా లేద‌నిపిస్తుంది. స్ర్కిప్ట్ ప‌రంగా ఇంకాస్త వ‌ర్క్ చేసుంటే బాగుండేది. ఇక టెక్నిషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే…సందీప్ చౌతా సంగీతం బాగుంది. ఆత‌ర్వాత చెప్పుకోవాల్సింది విష్ణుశ‌ర్మ కెమెరా వ‌ర్క్ గురించే… 1971 వార్ ఎపిసోడ్ విజువ‌ల్స్ సూప‌ర్ అనేలా ఉన్నాయి. కొన్ని సీన్స్ ని ఎడిటింగ్ చేయాల్సింది. టోట‌ల్ గా మెహ‌బూబా గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే…. పూరి త‌న స్టైల్ ని కాస్త మార్చి చేసిన ఈ ప్ర‌య‌త్నం ఫ‌ర‌వాలేద‌నిపించినా… ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here