Home Political News మేము కన్నెర్ర చేస్తే.. కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలసిపోతుంది – టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌

మేము కన్నెర్ర చేస్తే.. కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలసిపోతుంది – టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌

89
0

మ‌హా కూట‌మి నేత‌లు ఈరోజు స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ మాట్లాడుతూ…తెలంగాణలోని టీడీపీ నేతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమ పై ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారని… ఏమీ చేయకుండానే మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. తాము కన్నెర్ర చేస్తే కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలసిపోతుంది అన్నారు

ఈ స‌మావేశంలో  సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగానే తామంతా కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. తమ మేనిఫెస్టోను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. విపక్ష నేతలను భయపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. కూట‌మిలో కాంగ్రెస్ పార్టీదే పెద్ద‌న్న పాత్ర‌. కేసీఆర్ దుష్ట‌పాల‌న‌కు వ్య‌తిరేకంగానే కూట‌మి ఏర్పడింది. మేం మ‌హా కూట‌మిలో కొన‌సాగుతాం. సీట్ల స‌ర్ధుబాటు పై మేం ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా మాట్లాడ‌లేదు అని కోదండ‌రామ్ తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here