Home Movie News మైత్రీ మూవీస్ చిన్న సినిమా నిర్మిస్తోందా..?

మైత్రీ మూవీస్ చిన్న సినిమా నిర్మిస్తోందా..?

87
0

మైత్రీ మూవీస్.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బ‌ష్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఆత‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో రంగ‌స్ధ‌లం చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించి హ్యాట్రిక్ సాధించింది. ఇప్పుడు నాగ చైత‌న్య‌తో నిర్మించిన‌ స‌వ్య‌సాచి, ర‌వితేజ‌తో నిర్మించిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రాల‌ను రిలీజ్ చేస్తుంది. అందుచేత మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ అన‌గానే భారీ చిత్రాలే గుర్తొస్తాయి.

అయితే..ఈ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ చిన్న సినిమా నిర్మిస్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మైత్రీ మూవీస్ అధినేత‌లే తెలియ‌చేసారు. చిన్న సినిమా బ‌డ్జెట్ ఎంత అంటే..89 ల‌క్ష‌లు. అవును..89 ల‌క్ష‌ల్లో సినిమాని కంప్లీట్ చేస్తార‌ట‌. ఈ సినిమా ద్వారా రితీష్ అనే ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తున్నార‌ట‌. అంతా కొత్త వాళ్ల‌తో నిర్మించే ఈ సినిమాని మ‌రో ప‌ది రోజుల్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మైత్రీ మూవీస్ అధినేత‌ల్లో ఒక‌రైన న‌వీన్ మాట్లాడుతూ…చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. మంచి సినిమాని అందించాలి అనేదే ముఖ్యం. స్టార్ హీరోల‌తో భారీ చిత్రాలే కాదు. కొత్త వాళ్ల‌తో కూడా ప్ర‌యోగాలు చేస్తామ‌న్నారు. చిన్న సినిమా కోసం ఓ మంచి టీమ్ దొరికింది. 89 ల‌క్ష‌ల్లో సినిమాని కంప్లీట్ చేస్తాం. ప‌బ్లిసిటీతో క‌లిపి కోటిన్న‌ర అవుతుంద‌న్నారు. మ‌రి..ఈ భారీ చిత్రాల నిర్మాత‌ల‌కు చిన్న సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here