Home News మోసం చేసే మేనిఫెస్టో కాదు… అమలు చేసే మేనిఫెస్టోను జనసేన ప్రకటిస్తుంది

మోసం చేసే మేనిఫెస్టో కాదు… అమలు చేసే మేనిఫెస్టోను జనసేన ప్రకటిస్తుంది

106
0

  •  మతం పేరుతో వేరు చేసే రాజకీయాలు చేయడం నచ్చదు

• దేశభక్తి అంటే ఒక్క బిజెపికి మాత్రమే ఉంటుందా.?• నా దేశభక్తి ఏమిటో తెలియాలంటే ప్రధాని మోడీని అడగండి

• చట్టసభల్లో ఇచ్చిన హామీని నిలుపుకోలేదు కాబట్టే బిజెపితో విభేదించా

• రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉంటా

• చిత్తూరు సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్.మ‌త గ్రంథాలు ప‌ట్టుకుని,

మ‌తం పేరుతో వేరు చేసే రాజ‌కీయం చేయ‌డం న‌చ్చ‌ద‌ని, మాన‌వ‌త్వానికి నిల‌బ‌డ‌ట‌మే న‌చ్చుతుంద‌ని జ‌న‌సేన పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్  పేర్కొన్నారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయితే.. అమ‌రావ‌తిని డెవ‌ల‌ప్ చేస్తారు…  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితే క‌డ‌ప‌ను డెవ‌ల‌ప్ చేస్తారు… అదే నేను ముఖ్యమంత్రి అయితే మాన‌వ‌త్వాన్ని నిల‌బెడ‌తానని అన్నారు. రాయ‌ల‌సీమ‌లో నా ఇంటి పేరుతో గ్రామం ఉంది. పుట్టింది గుంటూరులో,  పెరిగింది నెల్లూరులో, చెన్నైలో ఉన్నాను… పున‌ర్జ‌న్మ ఇచ్చింది తెలంగాణ‌… అందుకే నాకు దేశమంతా ఒక్క‌టేన‌ని,  అంద‌రిని స‌మానంగా చూస్తానన్నారు.  చిత్తూరు న‌గ‌రంలోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద జనసేన పోరాట యాత్ర సభ నిర్వహించారు. ఈ స‌మావేశానికి వేలాది మంది జ‌న సైనికులు, ఆడ‌ప‌డుచులు త‌ర‌లివ‌చ్చారు.
ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స‌గింస్తూ.. “చిత్తూరు అంటే గుర్తొచ్చేది జిడ్డు కృష్ణ‌మూర్తి. భార‌త‌దేశం తాలుకు ఆధ్యాత్మిక విలువ చాటి చెప్పిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతానికి కొన్ని కుటుంబాలు చెడ్డ పేరును తీసుకొస్తున్నాయి. చిత్తూరులో రౌడీయిజాన్ని జనసేన నియంత్రిస్తుంది. రాజ‌కీయాల్లో విలువ‌లు అథ‌: పతాళానికి ప‌డిపోతుంటే విసుగొచ్చి, తెగింపుతో పార్టీ పెట్టాను. రూపాయి ఖ‌ర్చులేకుండా జ‌న‌మే నా బ‌లం .. జ‌న బ‌ల‌మే నా గ‌ళం అని న‌మ్మి ముందుకు క‌దిలాను. కొంత మంది గోదావ‌రి జిల్లాల్లో ఉన్న‌ట్లు రాయ‌ల‌సీమ‌లో జ‌న‌సేన‌కు బ‌లం లేదు అంటున్నారు. నా బ‌లం వాళ్లకేం తెలుసు. 2009లో ఒక‌సారి దెబ్బ‌తిన్నాం. అవ‌మానాలు ఎదుర్కొన్నాం. మార్పు కోసం బ‌ల‌మైన ఉద్య‌మాలు తీసుకువ‌చ్చాం. ఇది దెబ్బ‌తిన్న‌వాడు పెట్టిన పార్టీ. దోపిడి, అవినీతి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల తుప్పురాల‌గొట్ట‌డానికే పార్టీ పెట్టాను. క‌ష్టాలు ఉంటాయ‌ని తెలుసు. ఎదురుదాడులు ఉంటాయ‌నీ తెలుసు. అన్నింటికీ సిద్ధ‌ప‌డే వ‌చ్చా. కుటుంబ‌ రాజ‌కీయాలు చేయ‌డానికి రాలేదు.  ముక్కుముఖం తెలియ‌వాళ్లు, ప‌రిచ‌యం లేనివాళ్లు, ఒకే భావజాలంలో ఆలోచించే వారంద‌రిని ఒక చోటుకు చేర్చాను.  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌ల‌మ‌నేరు, పుంగనూరు నుంచి చిత్తూరు వ‌ర‌కు అంద‌రిని కొత్త‌వారిని అభ్య‌ర్ధులుగా నిల‌బెడ‌తాం.
చట్ట సభల్లో ఒక్క ప్రతినిధి లేకుండానే జనసేన చిత్తూరు హై రోడ్డు విషయంలో పోరాడి… బాధితులకు అనుకూలంగా కూల్చివేతలు ఆపించింది. ప్రతిపక్షం మాత్రం పోరాటం చేయలేకపోయింది. చిత్తూరులోని సహకార రంగంలోని డెయిరీని హెరిటేజ్ కోసం చంపేశారు. సహకార చక్కెర కర్మాగారం మూయించేశారు. జనసేన ప్రభుత్వం వచ్చాక సహకార రంగానికి ఊపిరిపోసి రైతాంగానికి మేలు చేస్తుంది. మోసం చేసే మ్యానిఫెస్టో ఇవ్వను.. అమలు చేయగలిగే మ్యానిఫెస్టోను తీసుకొస్తాను అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here