Home Actor మ‌జిలీ డైరెక్ట‌ర్ శివ త‌దుపరి చిత్రం ఎవ‌రితో..?

మ‌జిలీ డైరెక్ట‌ర్ శివ త‌దుపరి చిత్రం ఎవ‌రితో..?

93
0

నిన్నుకోరి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. తొలి చిత్రంతోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. తాజాగా యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య – స‌మంత జంట‌గా శివ తెర‌కెక్కించిన చిత్రం మ‌జిలీ. విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందిన మ‌జిలీ చిత్రం క్లాసు, మాసు, ఫ్యామిలీసు..అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని సూప‌ర్ స‌క్స‌స్ సాధించింది.

దీంతో వ‌ర‌సగా రెండు చిత్రాల‌తో సూప‌ర్ స‌క్స‌స్ సాధించ‌డంతో ఈ యువ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌తో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే…శివ త‌దుపరి చిత్రం గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే…సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌రకొండ శివ‌ను క‌థ చెప్ప‌మ‌ని అడ‌గ‌డం..శివ క‌థ చెప్ప‌డం..లైన్ న‌చ్చి ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని చెప్ప‌డం జ‌రిగింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్, క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ శివ‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని తెలిసింది. డిసెంబ‌ర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here