Home Actor మ‌జిలీ నుంచి మ‌రో పాట – ప్ర‌మోష‌న్స్ జోరు పెంచిన చై – సామ్ జంట‌..!

మ‌జిలీ నుంచి మ‌రో పాట – ప్ర‌మోష‌న్స్ జోరు పెంచిన చై – సామ్ జంట‌..!

69
0


అక్కినేని నాగ చైత‌న్య – స‌మంత జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈరోజు యేడెత్తు మ‌ల్లెలే కొప్పులోన చేరే దారి లేదే..నీ తోడు కోయిలే నీ తోడు కోయిలే పొద్దుగూకే వేళ కూయలేదే ..అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు.

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.  ఈ పాట‌ను డైరెక్ట‌ర్ శివ నిర్వాణ రాయ‌డం విశేషం. కాల భైరవ – నిఖిత గాంధీ ఆలాపన బాగున్నాయి. దివ్యాంశ కౌశిక్ ముఖ్యమైన పాత్రను పోషించారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో  చై – సామ్ జంట ప్ర‌మోష‌న్స్ లో జోరు పెంచారు. దీంతో రోజురోజుకు ఈ సినిమా పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇటు యూత్,  అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని  ఆకట్టుకుని  ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని అందిస్తుంద‌ని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here