Home Actor మ‌జిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఇంట్రస్టింగ్ అప్ డేట్..!

మ‌జిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఇంట్రస్టింగ్ అప్ డేట్..!

84
0


అక్కినేని నాగ చైత‌న్య – స‌మంత జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన మ‌జిలీ సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో..ఈ సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఎమోష‌న‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమాలో చైత‌న్య క్రికెట‌ర్ గా న‌టించారు.

ఈ నెల 31న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్ధాయిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు యువ స‌మ్రాట్ నాగార్జున – విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిధులుగా హాజ‌రు కానున్నారు. హైద‌రాబాద్ జెఆర్సీ క‌న్వెష‌న్ సెంట‌ర్ లో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు.  వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయ్యే విధంగా నాగ‌చైత‌న్య పూర్ణ‌ అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఈయ‌న పాత్ర ఇన్‌టెన్స్‌గా, వైవిధ్యంగా ఉంటుంది. అలాగే స‌మంత అక్కినేని శ్రావ‌ణి అనే అమ్మాయిగా క‌న‌ప‌డుతుంది. ఈమె త‌న‌ న‌ట‌న‌తో న‌వ్విస్తూ..ఏడిపిస్తూ..అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఉంటుంది. మ‌రో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here