Home Actor మ‌జిలీ రివ్యూ..!

మ‌జిలీ రివ్యూ..!

237
0


అక్కినేని నాగ చైత‌న్య – స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ సాంగ్స్ & ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం మ‌జిలీ పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పెళ్లి త‌ర్వాత చైత‌న్య‌, స‌మంత క‌లిసి న‌టించిన తొలి చిత్రం కావ‌డంతో ప్రేక్ష‌కాభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూసారు. ఈ రోజు (ఏప్రిల్ 5)న ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌జిలీ రిలీజైంది. మ‌రి…అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు మ‌జిలీ ఆక‌ట్టుకుందా..?  చైత‌న్య‌, స‌మంత జంట మ‌రోసారి మాయ చేసారా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే..!

క‌థ – వైజాగ్ లో ఉండే పూర్ణ (నాగ చైత‌న్య‌)కు క్రికెట్ అంటే ప్రాణం. ఇండియ‌న్ క్రికెట్ టీమ్ లో ఆడాల‌నేది అత‌ని ల‌క్ష్యం. అత‌నిలో ఉన్న ప‌ట్టుద‌ల చూసి కోచ్ శ్రీను (ర‌వి ప్ర‌కాష్) ఎంక‌రేజ్ చేస్తాడు. అయితే…అనుకోకుండా ఓ రోజు అన్షు (దివ్యాన్ష కౌశిక్‌) పూర్ణ‌కు క‌నిపిస్తుంది. మొద‌ట గొడ‌వ‌ల‌తో ప‌రిచ‌య‌మైన పూర్ణ‌, అన్షు… త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య స్నేహం పెర‌గ‌డం…ఆ స్నేహం కాస్త ప్రేమ‌గా మార‌డం జ‌రుగుతుంది. వీరిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం అన్షు ఇంట్లో తెలుస్తుంది. అన్షు తండ్రి (అతుల్ కుల‌క‌ర్ణి) కి ఇష్టం లేక‌పోవ‌డంతో వారిద్ద‌రిని విడ‌గొడ‌తాడు. ఆత‌ర్వాత పూర్ణ‌కు శ్రావ‌ణి(స‌మంత‌)తో పెళ్లి అవుతుంది కానీ…పూర్ణ మాత్రం అన్షు జ్ఞాప‌కాల‌తోనే బ్ర‌తుకుతుంటాడు. అనుకోకుండా వారి లైఫ్ లోకి మీరా వ‌స్తుంది. ఇంత‌కీ..అన్షు ఏమైంది..?  మీరా ఎవ‌రు..?  శ్రావ‌ణిలో వ‌చ్చిన మార్పు ఏంటి..?  పూర్ణ తీసుకున్న నిర్ణ‌యం ఏంటి..?  అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

చైత‌న్య‌, స‌మంత న‌టన‌

క‌థ‌, క‌థ‌నం

డైలాగులు

గోపీసుంద‌ర్, త‌మ‌న్ సంగీతం

విష్ణు శ‌ర్మ కెమెరా వ‌ర్క్

మైన‌స్ పాయింట్స్

అక్క‌డ‌క్క‌డా స్లోగా ఉండ‌డం

విశ్లేష‌ణ –  థియేట‌ర్ లోకి వ‌చ్చిన ప్రేక్ష‌కుడు ఒక్క‌సారి క‌థ స్టార్ట్ కాగానే క‌నెక్ట్ అయిపోతాడు అని డైరెక్టర్ శివ నిర్వాణ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో చెప్పారు. శివ చెప్పిన‌ట్టుగా..నిజంగానే ఒక్క‌సారి స్టోరీ స్టార్ట్ కాగానే అన్నీ మ‌ర‌చిపోయి క‌థ‌తో ట్రావెల్ అవుతారు. అక్క‌డ నాగ చైత‌న్య క‌నిపించ‌డు. పూర్ణ పాత్రే క‌నిపిస్తుంది. నాగ చైత‌న్య ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమా మ‌రో ఎత్తు అని చెప్ప‌చ్చు. పూర్ణ జీవితాన్ని చూసిన‌ట్టు అనిపిస్తుంది. ఎక్క‌డా చైత‌న్య న‌టించాడు అనిపించ‌దు. జ‌స్ట్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా బిహేవ్ చేసాడు అంతే అనిపిస్తుంది. అంత అద్భుతంగా న‌టించాడు. ప్రేమ‌, కోపం, బాధ‌..ఇలా ఓ భ‌గ్న ప్రేమికుడు ఫీలింగ్స్ అన్నింటినీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించాడు. ఇలా పూర్ణ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఇక పూర్ణ త‌ర్వాత చెప్పుకోవాల్సింది. శ్రావ‌ణి పాత్ర గురించి. త‌ను ప్రేమించిన‌వాడు భ‌ర్త‌గా త‌న లైఫ్ లోకి వ‌చ్చినా…ఆమెని ప్రేమించ‌క‌పోవ‌డంతో ఓ వైపు బాధ‌, మ‌రో వైపు అత‌ని పై ప్రేమ‌ను..త‌న‌దైన శైలిలో చూపించి మ‌రోసారి అద్భుత‌మైన న‌టి అనిపించుకుంది స‌మంత‌. దివ్యాన్ష కౌశిక్ అన్షు పాత్ర‌లో పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించింది. ల‌వ్‌లెట‌ర్‌లో రాసుకున్న అమ్మాయి పేరే వెడ్డింగ్ కార్డు మీద ఉండ‌దు రా..వెధ‌వ‌ల‌కు ఎప్పుడూ మంచి పెళ్లాలే వ‌స్తారని నువ్వే నిరూపించావ్..త‌దిత‌ర‌ డైలాగులు బాగా ఆక‌ట్టుకున్నాయి.

రావు ర‌మేష్, పోసాని కృష్ణ ముర‌ళి పాత్ర‌లు సన్నివేశానికి త‌గ్గ‌ట్టు ఓసారి న‌వ్విస్తూ..ఓసారి ఆలోచింప‌చేస్తూ..మ‌రోసారి ఏడిపిస్తూ..ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన  డైరెక్ట‌ర్ శివ ప్రేమ క‌నిపిస్తుంది.  అయితే..అక్క‌డ‌క్క‌డా కాస్త స్లో అయిన‌ట్టు అనిపిస్తుంది. అతుల్ కుల‌క‌ర్ణి, సుబ్బ‌రాజు…అలాగే సంగీతం, ఎడిటింగ్, కెమెరావ‌ర్క్..ఇలా ప్ర‌తి ఆర్టిస్ట్ & టెక్నీషియ‌న్స్ బాగా సెట్ అయ్యారు. మ‌జిలీ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…చైత‌న్య‌, స‌మంత మ‌రోసారి మాయ‌ చేసారు. మ‌జిలీతో మంచి విజ‌యం సాధించారు.

రేటింగ్ – 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here