Home Actor మ‌న్మ‌థుడు 2 ఆగ‌ష్టు 9న వ‌స్తుందా..? లేదా..?

మ‌న్మ‌థుడు 2 ఆగ‌ష్టు 9న వ‌స్తుందా..? లేదా..?

35
0
మ‌న్మ‌థుడు 2 ఆగ‌ష్టు 9న వ‌స్తుందా..? లేదా..? spiceandhra

కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రం మన్మథుడుకి సీక్వెల్ గా రానున్నచిత్రం మ‌న్మ‌థుడు 2. చి ల సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్ బ్యాన‌ర్స్ పై ఈ చిత్రం రూపొందుతోంది.  ఈ సినిమా పై టాలీవుడ్ లోను అలానే అక్కినేని అభిమానుల్లోనూ మంచి అంచనాలున్నాయి.

నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ ప్రత్యేక పాత్ర‌లు పోషించ‌గా, సీనియర్ నటి లక్ష్మి, నాజర్, వెన్నెల కిశోర్, రావు రమేష్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాని ఆగ‌ష్టు 9న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ఎనౌన్స్ చేసారు. అయితే… ఇంకా నెల రోజులే టైమ్ ఉంది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీకి సంబంధించి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌లేదు.

దీంతో అస‌లు ఎనౌన్స్ చేసిన డేట్ కి మ‌న్మ‌థుడు 2 వ‌స్తుందా..?  లేక వాయిదా ప‌డుతుందా..? అని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. నెల రోజులే ఉన్నా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటంటే… నాగార్జున ప్ర‌స్తుతం బిగ్ బాస్ 3 లో బిజీగా ఉన్నారట‌. ఈ నెల 21 నుంచి బిగ్ బాస్ 3 స్టార్ట్ కానున్న‌ట్టు స‌మాచారం. అందువ‌ల్ల‌నే మ‌న్మ‌థుడు 2 ప్ర‌మోష‌న్స్ ఇంకా స్టార్ట్ కాలేదని.. త్వ‌ర‌లోనే స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here