టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం మన్మథడు -2. చి ల సౌ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 పిక్చర్స్, మనం ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన రెండు టీజర్లు మూవీ పై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ మూవీలోని చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో రూపొందిన ‘హేయ్ మెనినా’ అనే పల్లవితో సాగె సాంగ్ ని ఈనెల 21న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ప్రస్తుతం శరవేగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. మరి.. అంచనాలకు తగ్గట్టుగా మన్మథుడు 2 ఆశించిన విజయాన్ని సాధిస్తాడని ఆశిద్దాం.