Home Actor మ‌న్మ‌థుడు 2 మెలోడీ సాంగ్ అదిరిందిగా..!

మ‌న్మ‌థుడు 2 మెలోడీ సాంగ్ అదిరిందిగా..!

39
0
మ‌న్మ‌థుడు 2 మెలోడీ సాంగ్ అదిరిందిగా..! spiceandhra

టాలీవుడ్ కింగ్ నాగార్జున కథానాయకుడిగా న‌టించిన తాజా చిత్రం మన్మథుడు 2. ఈ చిత్రానికి చి.ల‌.సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దాదాపు విదేశాల్లోనే నిర్మితమైన ఈ సినిమాలో, నాగ్ సరసన నాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఆగ‌ష్టు 9న ఈ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ రోజు ఈ సినిమాలోని లిరిక‌ల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.

నా లోనా నీవేనా ప్రేమై నేడు పూచేనా .. అంటూ ఈ పాట సాగుతోంది. నాగ్ – రకుల్ పై చిత్రీకరించిన ఈ పాట కొత్తగా వుంది. ఈ పాట‌కు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించ‌గా  శుభం విశ్వనాథ్ సాహిత్యం అందించారు. చిన్మయి ఆల‌పించారు. ఈ సినిమాలో, సమంత, కీర్తి సురేష్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. మ‌న్మ‌థుడు 2 ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here