Home Actor మ‌న్మ‌థుడు 2 రివ్యూ..!

మ‌న్మ‌థుడు 2 రివ్యూ..!

336
0

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. చి.ల‌.సౌ చిత్రంతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నాగ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. మ‌న్మ‌థుడు సినిమా నాగార్జున కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది. ఈ సినిమా క‌థ‌కి ఏ మాత్రం సంబంధం లేక‌పోయినా మ‌న్మ‌థుడు 2 టైటిల్ పెట్ట‌డం… ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో… ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ రోజు (ఆగ‌ష్టు 9న‌) మ‌న్మ‌థుడు 2 ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి… ఈ మ‌న్మ‌థుడు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్నాడా..? లేదా..? అనేది చెప్పాలంటే… ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – పోర్చుగ‌ల్ లో ఉండే సామ్ (నాగార్జున‌) వ‌య‌సు వ‌చ్చి వెళ్లిపోతున్నా.. పెళ్లి మాత్రం చేసుకోడు. పెళ్లి వ‌ద్దు.. పిల్ల‌లు వ‌ద్దు అంటుంటాడు. అయితే… ఇంట్లో వాళ్లు మాత్రం పెళ్లి చేసుకోమ‌ని ప‌దే ప‌దే అడుగుతుంటారు. ఇక లాభం లేదు ఫ్యామిలీ మెంబ‌ర్స్ పెళ్లి గోల నుంచి ఎలా త‌ప్పించుకోవాలని ఆలోచించి ఓ నిర్ణ‌యానికి వ‌స్తాడు. అదేంటంటే… త‌ను ఒక అమ్మాయిని ప్రేమించ‌క‌పోయినా… ప్రేమించాన‌ని చెబుతాడు. స‌రే..ఇంటికి తీసుకురా అంటే…త‌న ప్రియురాలుగా న‌టించేందుకు అవంతిక (ర‌కుల్ ప్రీత్ సింగ్) సెలెక్ట్ చేసుకుంటాడు. అవంతిక ఒక బార్ లో ప‌ని చేస్తుంటుంది.

త‌న‌కు డ‌బ్బులు అవ‌స‌ర‌మై సామ్ ప్రియురాలుగా న‌టించేందుకు ఓకే అంటుంది. అవంతికి సామ్ ఇంటికి వ‌చ్చి అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. సామ్, అవంతికల‌కు పెద్ద‌లు పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. అయితే…అవంతిక పెళ్లి టైమ్ కి క‌నిపించ‌కుండా వెళ్లిపోతుంది. ఆత‌ర్వాత ఇదంతా నాట‌కం అని.. సామ్ ప్లాన్ అని ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి తెలిసిపోతుంది. సామ్ మ‌ద‌ర్ కి నిజం తెలిసి హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. ఆత‌ర్వాత ఏం జ‌రిగింది…? ఈ విష‌యం తెలిసిన త‌ర్వాత అవంతిక ఎలా రియాక్ట్ అయ్యింది..? చివ‌రికి సామ్ పెళ్లికి ఓకే చెప్పాడా..? లేదా..? అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ – సాంబ‌శివ‌రావు (నాగార్జున‌) అంద‌రూ అత‌న్ని సామ్ అని పిలుస్తుంటారు. పోర్చుగ‌ల్ లో సెటిలైన తెలుగు ఫ్యామిలీ. పెర్ ఫ్యూమ్ బిజినెస్ చేస్తుంటాడు. అయితే…అత‌ని లైఫ్ లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న వ‌ల‌న పెళ్లి చేసుకోకూడ‌దు అని నిర్ణ‌యించుకుంటాడు. ఇంట్లో వాళ్ల పెళ్లి గోల కాద‌న‌లేక ప్రేమించాను అని అబ‌ద్ధం చెప్పి ఓ అమ్మాయిని ఇంటికి తీసుకురావ‌డం.. ఆ అమ్మాయికి రోజుకి ఇంత అని డ‌బ్బులు ఇవ్వ‌డం అనే కాన్సెప్ట్ తో గ‌తంలో కొన్ని సినిమాలు వ‌చ్చాయి. అల్లుడు గారు, ప‌విత్ర బంధం, మొగుడు కావాలి…ఇలా ఎప్పుడో వ‌చ్చిన క‌థలో ఏమీ కొత్త‌ద‌నం క‌నిపించిందో ఏమో కానీ.. ఈ క‌థ‌ను ఎంచుకున్నారు. ఈ క‌థ‌ను ఎంచుకోవ‌డ‌మే ఓ త‌ప్పైతే…దీనికి మ‌న్మ‌థుడు 2 అని టైటిల్ పెట్ట‌డం మ‌రో త‌ప్పు.

మ‌న్మ‌థుడు క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అయితే…ఈ మ‌న్మ‌థుడు 2 లో డ‌బుల్ మీనింగ్ డైలాగులు. థియేట‌ర్ లో కాసేపు న‌వ్వుకున్నా…ఏంటి ఈ డైలాగులు అనిపిస్తాయి. ఇక ర‌కుల్, ఝాన్సీ మ‌ధ్య చిత్రీక‌రించిన ముద్దు స‌న్నివేశం అయితే… అస‌లు ఏంటిది అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, రావు ర‌మేష్ త‌న‌దైన శైలిలో న‌టించి న‌వ్వించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంద‌నిపించినా పాట‌లు మాత్రం పాడుకునేలా లేవు. సామ్ త‌ల్లిగా ల‌క్ష్మి, అక్క‌లుగా ఝాన్సీ , దేవ‌ద‌ర్శిని, చెల్లెలుగా నిశాంతి బాగా న‌టించారు. స‌మంత‌, కీర్తి సురేష్ క‌నిపించింది కాసేపే అయినా సంద‌ర్భానుసారంగా వ‌చ్చేలా చూపించారు. తొలి ప్ర‌య‌త్నంలో విజ‌యం సాధించిన‌ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ మ‌లి ప్ర‌య‌త్నంలో మాత్రం ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయారు.

రేటింగ్ 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here