టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు 2. ఈ చిత్రానికి చి ల సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఫస్ట్ టీజర్ కు ట్రెమండ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాగార్జున వయసు పెరిగినా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా ముదురు బ్రహ్మచారిగా పైకి కనిపిస్తూ..ఎవరికీ తెలియకుండా అమ్మాయిలతో రొమాన్స్ చేసే మన్మథుడుగా అదరగొట్టేసాడు.
ఫస్ట్ టీజర్ లో రకుల్ పాత్ర ఎలా ఉంటుందో చూపించలేదు. ఇప్పుడు రకుల్ అవంతిక పాత్రలో ఎలా ఉంటుందో చూపిస్తూ…సెకండ్ టీజర్ రిలీజ్ చేసారు. ఇక అవంతిక గురించి చెప్పాలంటే… ఈ అవంతిక పేరే ఎంత వినసొంపుగా ఉంది. అంతే పద్దతి గల అమ్మాయి అనుకుంటారు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇప్పటి వరకు యు సర్టిఫికెట్ కోసం ప్రయత్నించాను. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తా అంటుంది.
ఈ డైలాగ్ తో రకుల్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పేసారు. కీర్తి సురేష్, సమంత గెస్ట్ రోల్స్ లో కనించనున్నారు. సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆగష్టు 9న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. రెండు టీజర్స్ బాగానే ఉన్నాయి. మరి…మన్మథుడు 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.