Home Actor మ‌న్మ‌ధుడి స‌ర‌స‌న న‌టించే నాయిక ఖ‌రారు..!

మ‌న్మ‌ధుడి స‌ర‌స‌న న‌టించే నాయిక ఖ‌రారు..!

117
0

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రం మ‌న్మ‌ధుడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ క‌థ – మాట‌ల‌తో స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన మ‌న్మ‌ధుడు చిత్రం నాగార్జున కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. చి ల సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్చి నుంచి ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌. ప్రస్తుతం ఈ భామ మాస్ మ‌హారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ భామ‌ను మ‌న్మ‌ధుడు సీక్వెల్ లో హీరోయిన్ గా తీసుకోవాలి అనుకుంటున్నార‌ట‌. 60 రోజులు విదేశాల్లో షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మైతే…పాయ‌ల్ కి బంప‌ర్ ఆఫ‌రే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here