Home Movie News మ‌న్మ‌ధుడు 2 మూవీలో హీరో ఎవ‌రో తెలుసా..?

మ‌న్మ‌ధుడు 2 మూవీలో హీరో ఎవ‌రో తెలుసా..?

111
0
Naga-Chaitanya-Shailaja-Reddy-Alludu

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం మ‌న్మ‌ధుడు. మాట‌ల మాంత్రికుడు తివిక్ర‌మ్ క‌థ – మాట‌లు అందించ‌గా, విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మ‌న్మ‌ధుడు 2 అనే టైటిల్ ను అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై రిజిష్ట‌ర్ చేయించ‌డంతో ఎవ‌రి కోసం ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించార‌నే ఆస‌క్తి ఏర్ప‌డింది. నాగార్జున మ‌న్మ‌ధుడు 2 టైటిల్ తో సినిమా చేయ‌నున్నారా..?  లేక చైత‌న్య‌, అఖిల్ కోసం ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించార‌నేది హాట్ టాపిక్ అయ్యింది.

ఇదిలా ఉంటే…నాగ‌చైత‌న్య లేటెస్ట్ మూవీ శైల‌జారెడ్డి అల్లుడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ చైతు కెరీర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన చిత్రంగా నిలుస్తుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చైత‌న్య మీడియాతో మాట్లాడుతూ..మ‌న్మ‌ధుడు 2 టైటిల్ నాన్న కోసం రిజిష్ట‌ర్ చేయించామ‌ని చెప్పాడు. చి ల సౌ డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని..ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. అదీ..సంగ‌తి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here