Home Entertainment మ‌మ్మ‌ల్ని చంపేయండి. కేసీయార్ ప్ర‌భుత్వానికి టీచ‌ర్ల డిమాండ్..!

మ‌మ్మ‌ల్ని చంపేయండి. కేసీయార్ ప్ర‌భుత్వానికి టీచ‌ర్ల డిమాండ్..!

71
0

తెలంగాణలో కేసీయార్ ప్ర‌భుత్వానికి వ‌ర‌స‌గా సెగ‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టి దాకా ఉన్న నిర‌స‌న గొంతులు విప్పారుతున్నాయి. ఇప్ప‌టికే ఇంట‌ర్ విద్యార్థుల‌కు జ‌రిగిన అన్యాయం మీద రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం మండిప‌డుతోంది. ఏకంగా 3 ల‌క్ష‌ల మంది విద్యార్థుల్ని ఫెయిల్డ్ ఖాతాలో వేసేయ‌టం మీద అభ్యంత‌రాలు వినిపిస్తున్నాయి. దీనికి ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కూడా తోడైంది.

మ‌రో వైపు గ‌తంలో టీచ‌ర్లుగా సెల‌క్ట్ అయిన ఉపాధ్యాయుల‌కు ఆర్డ‌ర్లు ఇవ్వ‌క పోవ‌టంతో వారంతా క‌లిసి రోడ్డెక్కారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం టీచ‌ర్ శిక్ష‌ణ పొందిన వారికి గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రాత ప‌రీ్క్ష నిర్వ‌హించారు. ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మీష‌న్ ద్వారానే ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. స‌ర్వీస్  క‌మిష‌నే రాతే ప‌రీక్ష నిర్వ‌హించింది. త‌ర్వాత ఆగ‌స్టులో 1-1 ప‌ద్ద‌తిలో అభ్య‌ర్థుల్ని ఎంపిక చేయ‌టం జ‌రిగింది. కానీ నెల‌లు గడుస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి స్పంద‌న లేదు. దీంతో సెలక్ట్ అయిన 8,792 మంది అభ్య‌ర్థుల భ‌విష్య‌త్ అంధ‌కారంలో ప‌డింది.

దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులంతా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ చేరుకొని ఆందోళ‌న చేప‌ట్టారు. మాన‌వ హక్కుల క‌మిష‌న్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా కు దిగారు. వెంట‌నే నియామ‌క ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని లేదంటే కారుణ్య మ‌ర‌ణాలకు అనుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. చంటి బిడ్డ‌ల‌తో స‌హా టీచ‌ర్లు మండుటెండ‌లో ధ‌ర్నా చేస్తుంటే ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. నెల‌లు గ‌డిచే కొద్దీ త‌మ ప‌రిస్థితి భ‌యాన‌కంగా త‌యారు అవుతోంద‌ని ఆందోళ‌న వెలిబుచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here