Home Actor మ‌రోసారి కాల‌ర్ ఎగ‌రేసిన మ‌హేష్ బాబు.

మ‌రోసారి కాల‌ర్ ఎగ‌రేసిన మ‌హేష్ బాబు.

101
0

సూపర్‌స్టార్‌ మహేష్ – సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపొందిన భారీ చిత్రం మ‌హ‌ర్షి.  వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా బ్యాన‌ర్స్ పై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ సినిమా రూపొందింది. ఇది మహేష్‌కు ఇది 25వ చిత్రం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు.  మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదలైన మ‌హ‌ర్షి మహేష్ కెరీర్లో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సంద‌ర్భంగా మ‌హ‌ర్షి యూనిట్  హైద‌రాబాద్ లోని సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎం థియేట‌ర్‌ను సంద‌ర్శించింది. ఈ కార్య‌క్ర‌మంలో  సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మాట్లాడుతూ…సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌కు వ‌చ్చి చాలా ఏళ్ల‌య్యింది. ఆరోజుల‌ను నేను మ‌రచిపోలేను. మురారి సినిమాను ఇదే థియేట‌ర్‌లో నేను చూసిన‌ప్పుడు నాన్న‌గారు నా భుజం పై చెయ్యి వేశారు. ఆరోజును నేను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఎ.ఎం.బి.సినిమాస్‌లో నేను పార్ట్‌న‌ర్ అయ్యి మ‌ల్టీప్లెక్స్ ఓపెన్ చేశాం. నాకు ఆ థియేట‌ర్ ఉన్నా.. ఈ సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌నే నా స్వంత థియేట‌ర్‌గా భావిస్తాను.

ఎందుకంటే నా కెరీర్ అలాంటి సినిమాలు ఇక్క‌డ రిలీజ్ అయ్యాయి. నా 25వ సినిమా మ‌హ‌ర్షి కూడా ఇక్క‌డ రిలీజ్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ థియేట‌ర్‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. మీ ఆశీస్సులు, అభిమానం ఇలాగే నా పై ఉండాలి. నా 25 సినిమాల కెరీర్‌లో ఈరోజు పొందిన ఆనందాన్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. మీ అంద‌రి కోసం మ‌రోసారి కాల‌ర్ ఎగ‌రేస్తున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here