Home Actor మ‌రోసారి వార్త‌ల్లో న‌వ మ‌న్మ‌థుడు. అస‌లు ఏం జ‌రిగింది..?

మ‌రోసారి వార్త‌ల్లో న‌వ మ‌న్మ‌థుడు. అస‌లు ఏం జ‌రిగింది..?

64
0
మ‌రోసారి వార్త‌ల్లో న‌వ మ‌న్మ‌థుడు. అస‌లు ఏం జ‌రిగింది..? SPICEANDHRA

కింగ్ నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. చి ల సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని డ‌బ్బింగ్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. నాగ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంటే… స‌మంత‌, కీర్తి సురేష్ గెస్ట్ రోల్స్ లో న‌టించారు. నిన్న రిలీజ్ చేసిన ఫ‌స్ట్ సాంగ్ కు చాలా మంచి రెస్సాన్స్ వ‌స్తుంది.

ఈ సాంగ్ లో నాగ్ లుక్స్, స్టైల్ సినిమా పై మ‌రింత ఆస‌క్తిని పెంచాయ‌ని చెప్ప‌చ్చు. ఈ మూవీ ట్రైల‌ర్ ను ఈ నెల 25న రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.  మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాల పై రూపొందిన ఈ మూవీని ఆగ‌ష్టు 9న రిలీజ్ చేయ‌నున్నారు. ఇలా ఓ.. వైపు మ‌న్మ‌థుడు 2 సినిమా సాంగ్ తో ఆక‌ట్టుకుంటే… మ‌రో వైపు బిగ్ బాస్ 3 హోస్ట్ గా ఆక‌ట్టుకుని వార్త‌ల్లో నిలిచారు టాలీవుడ్ కింగ్ నాగార్జున‌.

బిగ్ బాస్ 3 స్టార్ట్ కాకుండానే వివాదాలు రావ‌డం తెలిసిందే. ఈ వివాదాలు సీరియ‌స్ అవ్వ‌డంతో స్టార్ మా యాజ‌మాన్యం ఆలోచ‌న‌లో ప‌డింది. దీంతో ఈ షోను వాయిదా వేస్తార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే… ఎలాంటి వాయిదా లేకుండా బిగ్ బాస్ 3 నిన్న (ఆదివారం) రాత్రి 9 గంట‌ల‌కు స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ 3 ప్రారంభ‌మైన తొలి రోజునే హోస్ట్ గా షోను త‌న‌దైన శైలిలో ర‌క్తిక‌ట్టించి అద‌ర‌గొట్టేసాడు. బిగ్ బాస్ 3 తెలుగు,  వ‌ర‌ల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లో నెంబ‌ర్ 1గా నిలిచింద‌ని… నాగార్జున త‌న సంతోషాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here